For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  మా అత్తగారిని ఆ ఎమ్మెల్యే చంపించాడు: ‘దొరసాని’ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్

  |
  Dorasani Director KVR Mahindra Sensational Comments In A Recent Interview || Filmibeat Telugu

  మొదట షార్ట్ ఫిల్మ్స్ చేసి.. ఈ మధ్యనే 'దొరసాని' అనే సినిమాతో తెలుగు సినీ రంగ ప్రవేశం చేశారు డైరెక్టర్ కేవీఆర్ మహేంద్ర. ఈ సినిమాను ప్రేక్షకులు పెద్దగా ఆదరించలేదు. అయితే, ఇందులో నటించిన నటీ నటులకు, డైరెక్టర్ టేకింగ్‌కు మంచి మార్కులే పడ్డాయి. ఈ నేపథ్యంలో ఆయన ఓ యూట్యూబ్ చానెల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా తన ప్రేమ, పెళ్లి తదితర విషయాల గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు. అలాగే, తన అత్తగారి హత్య గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.

  మాది లవ్ మ్యారేజ్

  మాది లవ్ మ్యారేజ్

  నేను ఒకమ్మాయిని ప్రేమించాను. ఆమెతో చాలా కాలం ట్రావెల్ చేశాను. ఇద్దరం ఒకరిని ఒకరు అర్థం చేసుకున్న తర్వాత రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని వేరేగా ఉండిపోయాం. మా పెళ్లికి వాళ్ల వైపు నుంచి చాలా ఇబ్బందులు వచ్చాయి. ఆ తర్వాత కొద్దిరోజులకు మమ్మల్ని విడదీయలేక వదిలేశారు. తర్వాత అందరి ముందు పెళ్లి చేసుకున్నాం.

  మా అత్తగారిని చంపేశారు

  మా అత్తగారిని చంపేశారు

  మా అత్తగారిని చంపేశారు. మా వైఫ్ వాళ్లు చెప్పడం వల్లే నాకు తెలిసింది. ప్రత్యక్షంగా నేనైతే ఆ సీన్‌లో లేను కానీ, అది మాత్రం జరిగింది. నా వైఫ్ మూడు సంవత్సరాలు ఉన్నప్పుడు ఇది అయింది. ఆయన పేరు చెప్పడం కరెక్ట్ కాదేమో. నా వైఫ్ వాళ్ల అమ్మగారు అప్పుడు ఎంపీటీసీ. ఆమె జెండా ఎగుర వేస్తుంటే ఫైర్ చేశారంట. లోకల్ పాలిటిక్స్ వల్ల ఆమెను చంపేశారని మా వైఫ్ చెప్పింది. ఈమె ఎదిగితే మనకు ఇబ్బంది అవుతుంది అన్న ఉద్దేశ్యంతో చంపేశారంట. వాళ్ల జీవితాల్లో అదో పెద్ద విషయం.

  వాళ్ల అన్నయ్య తండ్రిలా చూసుకున్నాడు

  వాళ్ల అన్నయ్య తండ్రిలా చూసుకున్నాడు

  ఆ సమయంలో వాళ్ల అన్నయ్య మా వైఫ్‌ను షర్ట్ లోపల దాచుకుని వచ్చాడట. అప్పుడు ఆయనకు పది సంవత్సరాలు ఉంటాయి. ఆయన మా వైఫ్‌ను చాలా కేరింగ్‌గా చూసుకునేవాడు. ఆమెకు తండ్రి లాగా అయ్యాడు. ఆ వయసులోనే ఆమెను రక్షించాడంటే అదో సినిమాటిక్ డ్రామాలా జరిగిపోయింది. తర్వాత వాళ్లు చాలా కష్టాలు పడ్డారు. శత్రువుకు కూడా రాకూడదు. అంత ట్రావెలింగ్ ఉంది వాళ్ల లైఫ్‌లో. నేనివేమీ చూడలేదు కానీ, వాళ్లు చెప్పడం ద్వారా తెలిసింది.

  వాళ్లు ఇబ్బంది పడుతున్నారేమో

  వాళ్లు ఇబ్బంది పడుతున్నారేమో

  వాళ్ల అన్నయ్య ఎప్పుడో ఒకసారి ఫోన్ చేస్తుంటాడు. ‘ఇన్ని రోజులు పక్కనపెట్టేసి, ఇప్పుడు కలిస్తే.. డైరెక్టర్ అయ్యాక వస్తున్నామని అనుకుంటారేమో' అని వాళ్లు ఇబ్బంది పడుతున్నారేమో. అంతా బాగానే ఉంది. ఆమె వెళ్తొస్తుంటుంది. నేనొక్కడినే రిజర్వ్‌గా ఉన్నాను. వాళ్ల నాన్నగారు మొన్న సినిమా చూశారు. ఆయనో కాంట్రాక్టర్.

  నన్ను ఇగ్నోర్ చేస్తే..

  నన్ను ఇగ్నోర్ చేస్తే..

  నేను వాళ్లతో కలవను కానీ, మా ఆవిడ మాత్రం వెళ్తుంటుంది. నేను నా లైఫ్‌లో సినిమాలతో బిజీగా ఉండడం వల్ల వెళ్లడం లేదు. తర్వాత వెళ్తానో లేదో తెలియదు. వాస్తవానికి నన్ను ఎవరైనా ఇగ్నోర్ చేస్తే నేనూ వదిలేస్తాను. అప్పుడప్పుడూ ఫోన్‌లో మాట్లాడుతుంటాం.

  ‘దొరసాని' గురించి

  ‘దొరసాని' గురించి

  తెలుగు యంగ్ హీరో విజయ్ దేవరకొండ సోదరుడు ఆనంద్, సీనియర్ హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మిక కలిసి నటించిన చిత్రం ‘దొరసాని'. ఈ సినిమా ద్వారా కేవీఆర్ మహేంద్ర దర్శకుడిగా పరిచయమయ్యారు. సురేష్ ప్రొడక్షన్స్ సమర్పణలో మధుర ఎంటర్‌టైన్మెంట్స్, బిగ్ బెన్ సినిమాస్ పతాకాలపై మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని నిర్మించారు

  English summary
  Tollywood Young Hero Vijay Devarakonda Brother Anand, Senior Hero Rajashekar Daughter shivathmika acted Movie Dorasani. This Film Directed By KVR Mahendra.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X