అల్లు అర్జున్ అభిమానులకు డబుల్ ధమాకా!
హైదరాబాద్: ఇటీవలే ‘రేసు గుర్రం' చిత్రంతో హిట్టు కొట్టాడు టాలీవుడ్ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. ఆయన తర్వాత సినిమా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు ఫ్యాన్స్. అలా ఎదురు చూస్తున్న అభిమానులు డబుల్ ధమాకా చూడబోతున్నారు. అవును మీరు విన్నది నిజమే. అల్లు అర్జున్ నటించిన రెండు సినిమాలు ఒకే నెలలో విడుదల కాబోతున్నాయి.
గుణశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘రుద్రమదేవి' చిత్రంలో అల్లు అర్జున్ ‘గోన గన్నారెడ్డి' అనే కీలకమైన పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని 2015 ఫిబ్రవరిలో విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో అనుష్క టైటిల్ రోల్ పోషించింది. ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి.

మరో వైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఓ సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం సెట్స్ పై ఉంది. . హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై రాధాకృష్ణ ఈచిత్రాన్ని నిర్మించనున్నారు. సినిమాలో అల్లు అర్జున్ ముగ్గురు హీరోయిన్లతో రొమాన్స్ చేయబోతున్నాడు.
ఇప్పటికే హీరోయిన్లు సమంత, అదా శర్మ ఖరారయ్యారు. అయితే మూడో హీరోయిన్‌గా ప్రణీతను అనుకున్నప్పటికీ కొన్ని కారణాల వల్ల ఆమె స్థానంలో నిత్యా మీనన్‌ను తీసుకునే ఆలోచనలో త్రివిక్రమ్ ఉన్నాడని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని కూడా ఫిబ్రవరిలోనే విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.


Click it and Unblock the Notifications











