మెగా ఫ్యాన్స్‌కు డబుల్ ధమాకా.. సంక్రాంతికి పవన్, రాంచరణ్ సందడి..

By Rajababu

2018 సంవత్సరం మెగా ఫ్యాన్స్‌కు బ్రహ్మాండమైనదిగా కనిపిస్తున్నది. వచ్చే ఏడాది ఆరంభంలో పవన్ కల్యాణ్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వస్తున్న అజ్ఞాతవాసి సందడి చేయనున్న సంగతి తెలిసిందే. ఇక మరో మెగా హీరో రాంచరణ్‌ కూడా మరో రకంగా సందడి చేయడానికి సిద్ధం అవుతున్నారు.

మెగా ఫ్యాన్స్‌కు పండుగే

మెగా ఫ్యాన్స్‌కు పండుగే

వచ్చే నెల మెగా అభిమానులకు కేవలం సంక్రాంతి పండుగే కాదు. మరో రెండు పండుగలు కూడా రానున్నాయి. ఒకటి అజ్ఞాతవాసి చిత్రం జనవరి 10న విడుదలకాగా, మరో సంక్రాంతికి రంగస్థలం టీజర్ విడుదల వార్త.

సంక్రాంతికి రంగస్థలం టీజర్

సంక్రాంతికి రంగస్థలం టీజర్

పవన్ కల్యాణ్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఆనందంలో మునిగి తేలే ఫ్యాన్స్‌కు మంచి కిక్ ఇచ్చే విధంగా రంగస్థలం టీజర్‌ను రిలీజ్ చేయడానికి చిత్ర యూనిట్ ఏర్పాట్లు చేస్తున్నది.

Recommended Video

‘రంగస్థలం’ స్టొరీ లీకైంది..!
ఫస్ట్‌లుక్‌కు భారీ స్పందన

ఫస్ట్‌లుక్‌కు భారీ స్పందన

ఇటీవల విడుదలైన రంగస్థలం ఫస్ట్‌లుక్‌కు భారీ స్పందన వచ్చింది. 1980 దశకం నాటి పరిస్థితుల బ్యాక్‌డ్రాప్‌తో పూర్తిగా గ్రామీణ వాతావరణంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫొటోలు ఇప్పటికే సోషల్ మీడియా హల్‌చల్ చేస్తున్నాయి.

రంగస్థలంపై భారీ అంచనాలు

రంగస్థలంపై భారీ అంచనాలు

దర్శకుడు సుకుమార్ డైరెక్షన్‌లో విభిన్నమైన కథతో తెరకెక్కుతున్న రంగస్థలంపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి టీజర్ విడుదల చేసి వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

మార్చి 30న రంగస్థలం రిలీజ్

మార్చి 30న రంగస్థలం రిలీజ్

మెగా పవర్ స్టార్ రాంచరణ్ సరసన సమంత హీరోయిన్ గా నటిస్తున్నది. ఈ చిత్రంలో జగపతిబాబు, ఆది పినిశెట్టి, అనసూయ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చాడు. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మార్చి 30న థియేటర్స్ కి రానుంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X