టాలీవుడ్‌లో చిచ్చు పెట్టిన ‘డేట్’.. రవితేజపై కోపంతో ఛార్మీ ఏం చేసిందంటే!

సినిమా రంగానికి సంబంధించి అప్పుడప్పుడూ వివాదాలు చెలరేగుతూనే ఉంటాయి. అయితే, ఇవన్నీ చిన్న చిన్న వాళ్లకే పరిమితం అవుతుంటాయని చాలా మంది అనుకుంటారు. కానీ, పెద్దలు కూడా కొన్ని విషయాల్లో హర్ట్ అవుతారు. ఫలితంగా కొందరితో గొడవలకు దిగుతుంటారు. ఇక, సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇలాంటివి చాలానే హైలైట్ అవుతున్నాయి. అలా ఇప్పుడు ప్రముఖ నటి, నిర్మాత ఛార్మీ కౌర్ ఓ విషయంలో హర్ట్ అయినట్లు తెలిసింది. దీంతో ఆమె మాస్ మహారాజా రవితేజ మీద కోపాన్ని బహిరంగంగానే తెలిపింది. అసలేం జరిగిందో మీరే చూడండి!

మిస్టర్ బచ్చన్ అంటూ రవితేజ
మాస్ మహారాజా రవితేజ హీరోగా స్టైలిష్ డైరెక్టర్ హరీష్ శంకర్ రూపొందిస్తోన్న చిత్రమే 'మిస్టర్ బచ్చన్'. ఈ మూవీని పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్నారు. దీనికి మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇందులో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిపోయింది.

Double ISMART Producer Charmy Kaur Unfollows Ravi Teja and Harish Shankar In Social Media

డబుల్ ఇస్మార్ట్‌తో ఛార్మీ రెడీగా

రామ్ పోతినేని - పూరీ జగన్నాథ్ కాంబోలో రాబోతున్న చిత్రమే 'డబుల్ ఇస్మార్ట్'. ఇది 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్‌గా వస్తోంది. ఈ చిత్రాన్ని పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇందులో సంజయ్ దత్ కీలకమైన పాత్రను చేస్తున్నాడు. ఈ మూవీ షూట్ కూడా ఎప్పుడో అయిపోయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్, ప్రమోషన్స్ జరుగుతున్నాయి.

రెండు సినిమాలు ఒకటే రోజు
అటు మాస్ మహారాజా రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్'.. ఇటు రామ్ పోతినేని హీరోగా చేసిన 'డబుల్ ఇస్మార్ట్' మూవీలు ఆగస్టు 15వ తేదీనే విడుదల కాబోతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. దీంతో ఈ రెండు చిత్రాల హడావిడి తెలుగు రాష్ట్రాల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా ఒక దానికి మించి ఒకటి ప్రమోషన్స్‌లో దూసుకెళ్తున్నాయి.

Double ISMART Producer Charmy Kaur Unfollows Ravi Teja and Harish Shankar In Social Media

అన్‌ఫాలో చేసిన ఛార్మీ కౌర్

'మిస్టర్ బచ్చన్' హీరో మాస్ మహారాజా రవితేజ తన సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. అలాగే, రామ్ పోతినేని కూడా 'డబుల్ ఇస్మార్ట్'ను ప్రమోట్ చేయడానికి రెడీ అవుతున్నాడు. దీంతో అంతా సవ్యంగానే సాగుతుందని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఛార్మీ కౌర్.. రవితేజతో పాటు హరీష్ శంకర్‌ను సోషల్ మీడియాలో ప్లాట్‌ఫాంలలో అన్‌ఫాలో చేసింది.

రిలీజ్ డేట్ వల్లే చేసిందట
'డబుల్ ఇస్మార్ట్' మూవీ ప్రొడ్యూసర్ ఛార్మీ కౌర్.. 'మిస్టర్ బచ్చన్' టీమ్ రవితేజ, హరీష్ శంకర్‌ను సోషల్ మీడియాలో అన్‌ఫాలో చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. దీంతో ఈ రెండు సినిమా టీమ్‌ల మధ్య వివాదం తలెత్తినట్లు టాలీవుడ్‌లో టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా రిలీజ్ డేట్ విషయంలోనే చిచ్చు రేగినట్లు కొందరు సినిమా విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Double ISMART Producer Charmy Kaur Unfollows Ravi Teja and Harish Shankar In Social Media

వాస్తవానికి జరిగింది ఇదేనట

వాస్తవానికి 'డబుల్ ఇస్మార్ట్' మూవీని ఆగస్టు 29న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. కానీ, 'పుష్ప 2' వాయిదా పడడంతో రిలీజ్‌ను ఆగస్టు 15కు మార్చుకున్నారు. ఇది సోలో డేట్ అని చిత్ర యూనిట్ సంతోషించింది. కానీ, అప్పుడే రవితేజ 'మిస్టర్ బచ్చన్' మూవీని కూడా అదే రోజున రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిపైనే ఛార్మీ గుర్రుగా ఉన్నట్లు తెలిసింది. ఇండస్ట్రీ టాక్ ప్రకారం.. బయ్యర్లతో చేసుకున్న డీల్ వల్లే 'మిస్టర్ బచ్చన్' మూవీని ఆగస్టు 15న రిలీజ్ చేస్తున్నారట. మరి ఈ వివాదం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X