Double Ismart Business: డబుల్ ఇస్మార్ట్ రికార్డు బిజినెస్.. హనుమాన్ నిర్మాత ఎన్ని కోట్లకు కొన్నాడంటే

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కిన ఇస్మార్ట్ శంకర్ సంచలన విజయాన్ని అందుకుంది. పూరి టేకింగ్, రామ్ నటన, డైలాగ్స్ , పాటలు అప్పట్లో మాస్‌ను ఊపేశాయి. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్‌తో వస్తున్నారు రామ్ - పూరి. ఇందులో కావ్య థాపర్ హీరోయిన్‌గా నటిస్తుండగా.. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ ఓ కీలకపాత్ర పోషిస్తున్నారు. పూరీ కనెక్ట్స్ బ్యానర్‌పై పూరీ జగన్నాథ్, ఛార్మీ కౌర్‌లు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన పాటలు, టీజర్, ట్రైలర్‌లకు మంచి రెస్పాన్స్ వస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ఆగస్ట్ 15న డబుల్ ఇస్మార్ట్ ప్రేక్షకుల ముందుకు వస్తోంది.

రిలీజ్ డేట్ దగ్గరపడుతుంటంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను వేగవంతం చేసింది. ఇప్పటికే వైజాగ్, హైదరాబాద్, ముంబైలలో పలు ఈవెంట్స్ నిర్వహించగా.. తాజాగా రామ్, ఛార్మిలు తెలంగాణ పోలీస్ అకాడమీలో సందడి చేశారు. ఇండిపెండెన్స్ డే స్పెషల్ ప్రోగ్రామ్‌లో భాగంగా ట్రైనీ పోలీసులుతో వీరు ఇంటరాక్ట్ అయినట్లుగా సమాచారం. ఈ ఇంటర్వ్యూను ఆగస్ట్ 15న రిలీజ్ చేస్తారని తెలుస్తోంది. ఆదివారం వరంగల్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించి సందడి చేశారు.

Double Ismart theatrical rights business bagged by Hanuman producer Niranjan Reddy for fancy rate movie break even target details here

డబుల్ ఇస్మార్ట్ మూవీ సెన్సార్ కూడా పూర్తి చేసుకుంది. ఇస్మార్ట్ శంకర్ మాదిరిగానే , ఈ మూవీకి కూడా సెన్సార్ బోర్డ్ ఏ సర్టిపికెట్ ఇచ్చింది. రక్తపాతం, బూతులు, డబుల్ మీనింగ్ డైలాగ్స్ వంటి కంటెంట్ ఎక్కువగా ఉండటంతో ఈ సర్టిఫికెట్ వచ్చింది. 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్‌తో సినిమా రిలీజ్ కానుంది. ఇస్మార్ట్ శంకర్ థీమ్ లైన్ అయిన బ్రెయిన్ ప్లాంటేషన్ , మెమొరీ ట్రాన్స్‌ఫర్మ్ కథతోనే డబుల్ ఇస్మార్ట్‌ను కొనసాగిస్తున్నాడు పూరి.

మరి భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజిెస్ట్ ఎలా జరిగింది.. థియేట్రికల్ రైట్స్ ద్వారా పూరి - ఛార్మిలకు ఎన్ని కోట్లు వచ్చాయి అనేది ఆసక్తిగా మారింది. ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ రూ.60 కోట్లకు పైగా జరిగిందని ఫిలింనగర్ టాక్. ఈ రేంజ్‌లో బిజినెస్ జరగడానికి ఇస్మార్ట్ శంకర్ మూవీ.. బీ, సీ సెంటర్‌లలో ప్రభంజనం సృష్టించడమే కారణమని ట్రేడ్ పండితులు అంటున్నారు. ఈ మూవీని నైజాం ఏరియాలో హనుమాన్ నిర్మాతలు నిరంజన్ రెడ్డి, శ్రీమతి చైతన్య రెడ్డిలు రిలీజ్ చేయనున్నారు.

వీరికి చెందిన ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఇప్పటికే డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్ థియేట్రికల్ రైట్స్‌ని రూ.60 కోట్లతో కొనుగోలు చేసిందని టాక్. ఇందులో రూ.54 కోట్లు అడ్వాన్స్ కింద, రూ. 6 కోట్లను రిటర్నబుల్ అడ్వాన్స్‌గా చెల్లించినట్లుగా తెలుస్తోంది. అలాగే నైజాం రైట్స్‌ని రూ. 7 కోట్లతో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ సొంతం చేసుకుందట. దీంతో డబుల్ ఇస్మార్ట్ వరల్డ్ వైడ్‌గా బ్రేక్ ఈవెన్ కావాలంటే రూ.61 కోట్లు, నైజాంలో రూ.8 కోట్ల షేర్ రావాల్సి ఉంది. ఆగస్ట్ 15, లాంగ్ వీకెండ్, సెలవులను టార్గెట్ చేసుకుని కొన్ని చిన్నా , పెద్దా సినిమాలు రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాయి. మరి అంతటి పోటీని తట్టుకుని డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్‌లో వసూళ్లు సాధిస్తుందో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X