మహేష్-తమన్నాల డబుల్ మిల్క్ కాంబినేషన్ సూపర్...!

By Sindhu

'శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన 'ఢీ" చిత్రంలో మహేష్ గురించి బ్రహ్మానందం చెప్పిన డైలాగ్ గుర్తుండే ఉంటుంది ! 'ఢీ" చిత్రంలో ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించే ఓ సన్నివేశంలో మహేష్ మిల్క్‌బాయ్‌ లా వుంటాడు అంటాడు బ్రహ్మానందం..! ఇక ఈ డైలాగ్ ఎంత పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే. అయితే బ్రహ్మానందం పలికిన డైలాగ్‌ లో ఆవగింజత కూడా అతిశయోక్తి లేదని అందరూ ఒప్పుకోవాల్సిందే.

ఎందుకంటే మహేష్ అచ్చంగా అలాగే వుంటాడు మరి. అయితే తాజాగా ఈ మిల్క్‌ బాయ్‌ తో, మిల్కీవైట్ భామగా, ముట్టుకుంటే కందిపోయే అందాలతారగా భాసిల్లుతున్న తమన్నా జతకట్టబోతుంది. ఈ మిల్క్‌ బాయ్, మిల్కీవైట్‌ భామ జంటగా నటించనున్న చిత్రానికి ఇటీవల '100% లవ్"తో విజయాన్ని దక్కించుకున్న సుకుమార్ దర్శకుడు. ఇటీవలే మహేష్‌ తో 'దూకుడు" వంటి సంచలనాత్మక చిత్రాన్ని నిర్మించిన 14 రీల్స్ ఎంటర్‌ టైన్‌ మెంట్ అధినేతలు గోపీ ఆచంట, రామ్ ఆచంట, అనీల్ సుంకరలు ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు.

ప్రస్తుతం కథా చర్చలు జరుగుతున్న ఈ చిత్రంలో మహేష్ ఓ వైవిధ్యమైన గెటప్‌ లో కనిపించబోతున్నాడని ఫిల్మ్‌ నగర్ వార్త. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో సెట్స్ మీదకు వెళ్ళనున్న ఈ చిత్రంలో మహేష్‌ తో జోడి కట్టే అవకాశం రావడం పట్ల తమన్నా ఎంతో హ్యాపీగా వుందట. ఎందుకంటే ఈ ఇద్దరి కాంబినేషన్‌ లో రూపొందనున్న తొలిచిత్రమిది కావడమే ఇందుకు కారణం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X