twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'విశ్వరూపం-2' పై అందరికీ అదే సందేహం

    By Srikanya
    |

    హైదరాబాద్ : కమల్‌హాసన్‌ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన 'విశ్వరూపం' పెద్ద విజయాన్ని సొంతం చేసుకుంది. కమల్‌ దర్శకత్వ ప్రతిభను కూడా చాటింది. ప్రస్తుతం 'విశ్వరూపం-2' శరవేగంగా తెరకెక్కుతోంది. రెండోభాగానికి సంబంధించిన ప్రచారచిత్రాన్ని విడుదల చేశారు. కమల్‌హాసన్‌ శరీరం నుంచి తూటా దూసుకుపోతున్నట్లు ఉన్న ఈ పోస్టరు ఆసక్తిరేపుతోంది. ఇందులో కమల్‌ పాత్ర అంతమైపోతుందా? ఎలా? ఏమిటి? అన్న ఆసక్తికరమైన ప్రశ్నలు అభిమానులు, ప్రేక్షకుల్లో రేకెత్తుతున్నాయి.

    విశ్వరూపం 2'ని ఆగస్టులో విడుదల చేయాలన్నది కమల్‌హాసన్‌ ఆలోచన. తొలి భాగంలోని నటీనటులు చాలామంది కొనసాగింపులోనూ నటిస్తున్నారు. అంతర్జాతీయ ఉగ్రవాదాన్ని తెరపై 'విశ్వరూపం'లో ఆవిష్కరించారు కమల్‌హాసన్‌. స్వీయ దర్శకత్వంలో నటిస్తూ నిర్మించిన ఆ చిత్రం పలు వివాదాలను సృష్టించింది. ప్రస్తుతం కమల్‌ 'విశ్వరూపం 2' చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారు. దీన్ని ఆస్కార్‌ వి.రవిచంద్రన్‌ నిర్మిస్తున్నారు.

    ఇప్పటికే దాదాపు చిత్రీకరణ పూర్తయిందని చెన్నై సినీ వర్గాలు చెబుతున్నాయి. రెండో భాగంలోనూ అంతర్జాతీయ ఉగ్రవాదం ప్రస్తావన ఉంటుంది. దాంతోపాటు తల్లీబిడ్డల అనుబంధాన్ని ఆవిష్కరించబోతున్నారు. ఇందులో యుద్ధ ఘట్టాలు ఉత్కంఠను రేకెత్తిస్తాయని సమాచారం. ఇక 'విశ్వరూపం'లో చూపించలేకపోయిన కొన్ని సన్నివేశాలను సీక్వెల్ లో చూడొచ్చని కమల్‌హాసన్‌ తెలిపారు.

    ఇందులో యుద్ధ సన్నివేశాలు మరింత బ్రహ్మాండంగా ఉంటాయి. తొలి భాగంలో చూపించలేకపోయిన ప్రేమ, రొమాన్స్‌ సన్నివేశాలే కాక తల్లీకొడుకు మధ్య ఉండే అప్యాయత, అనురాగాలను కూడా కొనసాగింపులో చూపనున్నట్లు ఆయన వివరించారు.

    కమల్ చెన్నైలో మాట్లాడుతూ ''వివాదాల అవరోధాలను దాటుకుని విడుదలైంది. తొలి భాగంలో కొన్ని అంశాలు చూపించలేకపోయాను. ప్రేమ ఘట్టాలు లేవు. అలాగే తల్లీకొడుకుల మధ్య ఉండే ఆప్యాయతానురాగాలు లేవు. వాటన్నింటికి 'విశ్వరూపం 2'లో స్థానం ఉంది. ఇందులో యుద్ధానికి సంబంధించిన సన్నివేశాలు మరింత ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం సీక్వెల్‌ను తెరకెక్కించే పనిలో తీరిక లేకుండా ఉన్నాను'' అన్నారు.

    English summary
    Kamal Haasan's 'Vishwaroopam 2' first look is out and it looks promising just as the ones of it's first part 'Vishwaroopam' did. Kamal Haasan is directing this movie which has Pooja Kumar, Rahul Bose, Andrea Jeremiah, Jaideep Ahlawat and others in important roles.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X