కాలా విడుదల అనుమానమేనా.. రాజకీయం ఆలోచిస్తున్న రజనీ!
సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన తాజా చిత్రం కాలా. కబాలి ఫేమ్ పా రంజిత్ ఈ చిత్రానికి దర్శకుడు. హ్యూమా క్యురేషి, నానా పటేకర్ వంటి ప్రముఖ నటులు ఈ చిత్రంలో నటించారు. రజనీకాంత్ అల్లుడు ధనుష్ స్వయంగా ఈ చిత్రాన్ని నిర్మించడం విశేషం. సూపర్ స్టార్ రజని ఈ చిత్రంలో గ్యాంగ్ స్టర్ గా నటిస్తున్నాడు. జూన్ 7 న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సిద్ధం అవుతోంది. తాజా తమిళనాడు పరిస్థితుల నేపథ్యంలో కాలా విడుదల విషయంలో ఉహాగానాల మొదలయ్యాయి.

2.0 ఏమైందో తెలియదు
స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన రోబో సీక్వెల్ చిత్రం 2.0 పరిస్థితి ఏంటో ఎవరికీ అర్థం కావడం లేదు. వాయిదాలమీద వాయిదాలు పడుతూ వచ్చిన ఆ చిత్రం గురించి ఇంటివంటి వార్త లేదు.

ఐపీఎల్ ఫైనల్‌లో అన్నారు
2.0 టీజర్ ని ఐపీఎల్ ఫైనల్ వేదికగా విడుదల చేస్తాం అంటూ ప్రచారం జరిగింది. తమిళనాడు తూత్తుకుడి కాల్పుల ఘటన వలన ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసందర్భంగా చేసిన ట్వీట్ వలన దర్శకుడు శంకర్ కూడా విమర్శల పాలయ్యాడు. ఇలాంటి పరిస్థితుల్లో టీజర్ విడుదల సరికాదని వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

కాలాపై కూడా ఎఫెక్ట్
ఇదే పరిస్థితి కాలా చిత్రానికి కూడా తప్పేలా లేదు. జూన్ 7 న కాలా చిత్రం విడుదల కావాల్సి ఉంది. అంటే కనీసం 10 రోజులముందు నుంచి అయినా ప్రమోషన్ కార్యక్రమాలు మొదలు పెట్టాలి. చిత్ర పరిశ్రమ మొత్తం స్టెర్ లైట్ ఆందోళనకారులకు మద్దతుగా నిలుస్తున్న తరుణంలో సినిమా కార్యక్రమాలు సరికాదని రజని భావిస్తున్నారట.

విడుదల అనుమానమే
రజని రాజకీయాల్లోకి అడుగుపెట్టబోతున్న తరుణంలో ఇలాంటి వివాదాలు సరికాదని, కాలా విడుదల విషయంలో వెనక్కు తగ్గే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికైతే జూన్ 7 నే చిత్రం విడుదలవుతుందని చిత్ర యూనిట్ చెబుతోంది.


Click it and Unblock the Notifications











