హీరోయిన్స్ లావుగా ఉంటేనే నచ్చుతారు: రామానాయుడు
నాకు మాత్రం హీరోయిన్స్ కొద్దిగా లావు ఉంటేనే నచ్చుతారు అంటూ తన మనస్సులో మాటను మీడియా ముందు బయిటపెట్టారు ప్రముఖ నిర్మాత డా.రామానాయుడు. ఆయన హీరోయిన్స్ గురించి మాట్లాడుతూ...అప్పుడు కొద్దిగా లావుగా ఉన్నా బాగుంటుంది అనుకునేవారు. ఇప్పుడు ఎంత సన్నగా ఉంటే అంత బాగుంటుందంటున్నారు. అలాగే మీరు హీరోయిన్లను బాగా ఎంకరేజ్ చేస్తారంటారు..ఆన్నదానికి సమాధానంగా అలాగని ఏం లేదు. నేను అందరినీ బాగానే ఎంకరేజ్ చేస్తాను. అవి నేను పట్టించుకోను. వెనకటికి ఓ పేపర్ ఉండేది. పెద్ద హెడ్డింగ్‌లు పెట్టి రాసేవారు. అవన్నీ పట్టించుకోవాల్సిన అవసరం లేదు.అలాగే 126 మంది హీరోయిన్లు నా సినిమాల్లో చేశారు. 11 మంది హీరోయిన్లను పరిచయం చేశాను. అందరూ నచ్చినవారే. అందులో బాగా నచ్చిన హీరోయిన్ ఎవరంటే వాణిశ్రీ..ఆమెతో చాలా సినిమాలు చేసాను అని చెప్పుకొచ్చారు.
రామానాయుడు వెంకటేష్ ఈనాడు నమో వెంకటేశ వాణిశ్రీ బెండు అప్పారావు అల్లరి నరేష్ ఇవివి సత్యనారాయణ ramanaidu venkatesh eenadu namo venkatesa vanesri allari naresh


Click it and Unblock the Notifications