twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    అక్కినేని చివరి సందేశం, నాగ్-లక్ష్మి విడిపోవడంపై.... డా.కృష్ణక్క చెప్పిన ఇంట్రెస్టింగ్ విషయాలు!

    అక్కినేని నాగేశ్వరరావు గురించి డాక్టర్ కృష్ణ కుమారి ఆసక్తికర విషయాలు చెప్పారు.

    By Bojja Kumar
    |

    అక్కినేని నాగేశ్వరరావు మరణించి దాదాపు మూడున్నర సంవత్సరాలైంది. ఆయన జ్ఞాపకాలు అభిమానులను ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అక్కినేనికి సంబంధించి బయటి ప్రపంచానికి తెలియని చాలా విషయాలు..... ఇటీవల పాపులర్ యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో రచయిత్రి, డాక్టర్ కృష్ణక్క (కృష్ణకుమారి) వెల్లడించారు.

    Recommended Video

    Filmibeat Top Ten Stories ఫిల్మిబీట్ టాప్ టెన్ స్టోరీస్..

    అక్కినేని ఫ్యామిలీకి అత్యంత సన్నిహితురాలైన కృష్ణకుమారికి.... అక్కినేనిని అన్నయ్యా అని, అన్నపూర్ణమ్మను వదినా అని పిలిస్తూ వారికుటుంబంతో కలిసిపోయేంత చనువు ఉంది. ఆమె చెప్పిన విషయాలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి.

    చివరి రోజుల్లో ఎవరినీ గదిలోకి రానీయలేదు

    చివరి రోజుల్లో ఎవరినీ గదిలోకి రానీయలేదు

    ఎప్పుడూ పదిమందితో కలిసి సరదాగా నవ్వుతూ .. నవ్విస్తూ వుండే అక్కినేని, చివరి రెండు నెలలు తన గదిలోకి ఎవరినీ రానీయలేదు. ఎందుకు రానీయడం లేదని, "నేనంటే అభిమానులకు ప్రాణం కదా .. వాళ్లు నన్ను ఈ స్థితిలో చూస్తే గుండె బద్దలైపోతుంది. వాళ్లు అలా బాధపడుతూ వుంటే నేను భరించలేను. వాళ్లని బాధపెట్టడం ఇష్టం లేకనే ఎవరినీ రానీయడం లేదు" అని అక్కినేని అలా చేశారని కృష్ణకుమారి తెలిపారు.

    మనసున్న హీరో

    మనసున్న హీరో

    "చివరి క్షణాల్లో కూడా తన అభిమానులను గురించి ఆలోచించిన మనసున్న హీరో అన్నయ్య" అంటూ అక్కినేని గురించి ఆమె గుర్తు చేసుకున్నారు.

    అన్నయ్య అలా చేయడం చూసి ఆశ్చర్యపోయాను

    అన్నయ్య అలా చేయడం చూసి ఆశ్చర్యపోయాను

    "అక్కినేని నాగేశ్వరరావును అంతా నాస్తికుడు అంటారు. వదిన(అన్నపూర్ణ) పోయిన కొత్తల్లో .. ఒక రోజున ఆయన ఎక్కడున్నారా అని ఆ ఇంట్లో చూస్తూ వెళితే, పూజ గదిలో పూజ చేస్తూ కనిపించారు. ఆయన దేవుడికి దణ్ణం పెట్టుకుంటూ ఉండగా ఎవరూ చూడలేదు. నేను చూసి ఆశ్చర్యపోయాను.... అని తెలిపారు.

    వదిన మనసు ఎంతో బాధ పడుతుందని

    వదిన మనసు ఎంతో బాధ పడుతుందని

    పూజ చేస్తున్న విషయం నేను చూడగానే ఆయన నన్ను గమనించి .. "మీ వదిన నన్ను ఎంతగా ప్రేమించిందో .. నేను అంతకన్నా ఎక్కువగా ఆమెను ప్రేమించాను. ఇప్పుడు వదిన లేదు గదా అని ఈ గదిలో దీపం వెలిగించకపోయనా, పూజ చేయకపోయినా ఆమె మనసు ఎంతో బాధ పడుతుంది. అందుకే నేను రోజు పూజ చేస్తున్నాను" అని అన్నయ్య చెప్పగానే నా కళ్ల వెంట నీళ్లొచ్చాయని కృష్ణక్క గుర్తు చేసుకున్నారు.

    నరకయాతన పడ్డారు

    నరకయాతన పడ్డారు

    అన్నయ్య చివరి మూడు నెలలు నరకవేధన పడ్డారు. ఎప్పుడూ తెల్లడ్రెస్సు వేసుకుని చకచకా డైనింగ్ టేబుల్ వద్దకు వచ్చే ఆయన్ను నీరసంగా అటు ఇటు ఇద్దరు పట్టుకుని తీసుకొస్తుంటే చూడలేక పోయాను. నటిస్తూనే జీవితాన్ని చాలించాలనే ఒక ఎయిమ్ పెట్టుకున్నారు, అలాగే చివరి వరకు నటిస్తూనే ఎన్నారు అని కృష్ణక్క తెలిపారు.

    అన్నయ్య ఫోన్ చేశారు, ఆ రోజు రాత్రే...

    అన్నయ్య ఫోన్ చేశారు, ఆ రోజు రాత్రే...

    చివరి వారం రోజులు అన్నయ్యను చూడాలనిపించి. దిగులుగా ఉండి వెళ్లలేదు. ఒకసారి అన్నయ్యే ఫోన్ చేశారు. ఎలా ఉన్నావు అన్నాయ్యా నిన్ను చూడాలని ఉంది అన్నాను. నేను సరేగాని అమ్మా... నువ్వు అన్నతినడం లేదట, నిద్ర పోవడం లేదట అన్నారు. నేను ఉండను కదా నీకు ఎవరు చెబుతారు అన్న అర్థం ఆయన మాటల్లో అనిపించింది. అన్నయ్య నిన్ను చూడాలని అనగానే ఫోన్ వస్తుంది కదా... అపుడు వద్దువుకదా అన్నారు. అదే రోజు రాత్రి రెండున్నరకు అన్నయ్య తనువు చాలించినట్లు ఫోన్ వచ్చింది.... అని కృష్ణక్క గుర్తు చేసుకున్నారు.

    అక్కినేని సందేశం ఇదే

    అక్కినేని సందేశం ఇదే

    అప్పట్లో రామాపురంలో అన్నయ్య జన్మభూమి మొదలు పెట్టారు. చనిపోయే మూడు రోజుల ముందు... అందరినీ పిలిచి ఏది మరిచిపోయినా మరిచిపోక పోయినా జన్మభూమిని మరిచిపోవద్దు, అందరికీ సేవ చేయాలి. నేను లేక పోయినా సరే నా పిల్లలు చేస్తారు, నా పేరు నిలబడతారు అని నమ్ముతున్నాను అని ఆయన ఆఖరి సందేశం కుటుంబానికి ఇచ్చారు. జన్మభూమి జన్మభూమి అంటూ అలసిపోయి పడుకున్నారు.... అని కృష్ణక్క తెలిపారు.

    చాలా దానాలు చేసే వారు

    చాలా దానాలు చేసే వారు

    అక్కినేని చాలా కింది స్థాయి నుంచి వచ్చారు. కష్టం విలువ తెలుసు. అందువలన ఆయన తన దగ్గరికి వచ్చిన వాళ్లకి గుప్తదానం చేసేవారు. డబ్బు తీసుకున్నవాళ్లు మళ్లీ ఎప్పుడు ఇవ్వమంటారు? అని అడిగితే, నవ్వి ఊరుకునే వారు. ఎవరికి ఏమిచ్చారనే విషయం వేరెవరికీ తెలియనిచ్చే వాళ్లు కాదు. అందుకు నేను ప్రత్యక్ష సాక్షిని. ఆయన గురించి తెలియనివాళ్లు ఆయన ఎవరికేం చేశాడు? డబ్బులు లెక్కపెట్టుకుంటూ ఉంటారు అని అంటారు. కష్టార్జితం విలువ తెలుసు కనుక లెక్కపెట్టుకుంటారు. డబ్బును అనవసరంగా దుర్వినియోగం చేసేవారు కాదు. సద్వినియోగం చేసేవారు. అందుకే ఆయన "సంపాదించడం అంటే నాకు ఎంతో ఇష్టం, సద్వినియోగం చేసుకోవడం అంటే అంతకి మించిన ఇష్టం" అనేవారు అని కృష్ణక్క తెలిపారు.

    ఆయన చేసే ప్రతి పనికీ మెడికల్ రీజన్ ఉండేది

    ఆయన చేసే ప్రతి పనికీ మెడికల్ రీజన్ ఉండేది

    అన్నం తిన్న తర్వాత స్వీటు తినడం అన్నయ్యకు అలవాటు. అందరూ ఆయనకు స్వీట్ అంటే ఇష్టం అనుకుంటారు. కానీ అన్నయ్యకు లో బీపీ ఉంది. అలా ఉంటే అన్నం తిన్న తర్వాత బ్రెయిన్ కి బ్లడర్ సర్వ్యూలేషన్ తగ్గుతుంది. అందుకే స్వీటు తింటారు. ఆయన చేసే ప్రతి పనికి మెడికల్ రీజన్ ఉండేది. హార్ట్ పేషెంట్లు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డాక్టర్లకంటే ఎక్కువ చెప్పేవారు అని కృష్ణక్క గుర్తు చేసుకున్నారు.

    నాగార్జున, లక్ష్మి విడిపోవడంపై

    నాగార్జున, లక్ష్మి విడిపోవడంపై

    రామానాయుడు గారి అమ్మాయి లక్ష్మీ చాలా అమ్మాయి. ఈ రోజుల్లో భార్యభర్తల మధ్య క్లాష్ ఎలా వస్తుందో ఎవరూ చెప్పలేరు. నాగార్జున, లక్ష్మి విడిపోవడం అన్నయ్యకు బాధగా అనిపించినా కూడా తప్పని పరిస్థితుల్లో అలా జరిగింది. చైతన్య కూడా ఆ తాతగారి దగ్గర, ఈ తాతగారి దగ్గర ఉండి రెండు చోట్ల పెరిగి పెద్దవాడయ్యాడు. చిన్న బాబు నాగార్జునకు, లక్ష్మికి కూడా చైతన్య అంటే ప్రాణం... అని కృష్ణక్క తెలిపారు.

    అమలలో ఎక్స్ ట్రార్డినరీ క్వాలిటీస్ ఉన్నాయి

    అమలలో ఎక్స్ ట్రార్డినరీ క్వాలిటీస్ ఉన్నాయి

    అమలలో ఎక్స్‌ట్రార్డినరీ క్వాలిటీస్ ఉన్నాయి. ఆమె జంతుప్రేమికురాలు. మనం అందరం తలనొప్పిగా ఉంటే కాఫీతాగుతాం, మజ్జిగ తాగుతాం, పెరుగుతాగుతాం.... కానీ అమల అవేమీ ముట్టుకోదు. ఎందుకంటే అవి జంతువుల నుండి వచ్చినవని, వాటి నుండి వచ్చింది మనం తీసుకుంటే జంతువుకు సంబంధించినది తాగినట్లు ఉంటుందని అమల భావిస్తుంది. మంచితనం, మానవత్వం ఉన్న వ్యక్తి అమల.... అని కృష్ణక్క తెలిపారు.

    రాజకీయాల్లోకి రావాలనుకోలేదు

    రాజకీయాల్లోకి రావాలనుకోలేదు

    అన్నయ్య పార్టీ పెట్టాలని ఎప్పుడూ అనుకోలేదు, రామారావుగారిని కూడా మనకు ఎందుకు పార్టీ బ్రదర్ అన్నారు. వారిద్దరూ పార్టీలకు అతీతమైనవారు. తెలుగు చలన చిత్రసీమకు ఆ ఇద్దరు మేరు పర్వతం లాంటివారు. తాను రాజకీయాల్లోకి రావాలంటే ఎప్పుడో వచ్చేవారు. కానీ అన్నయ్యకు అలాంటి ఉద్దేశ్యం ముందు నుండీ లేదు అని కృష్ణక్క తెలిపారు.

    English summary
    Writer Dr. Krishna Kumari described the last moments of Telugu film industry thespian, Dr. Akkineni Nageswar Rao.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X