గౌరవ డాక్టరేట్ అందుకున్న మోహన్ బాబు

మోహన్ బాబు ఎంజీఆర్ వర్శిటీ డాక్టరేట్ అందుకున్నారు.తమిళ గవర్నర్ విద్యాసాగర్ రావు నుండి డాక్టరేట్ అందుకున్నారు.సినీ రంగంలో సేవలకుగాను ఆయనకు అవార్డు ఇచ్చారు. మోహన్ బాబు ఇప్పటి వరకు 500పైగా చిత్రాల్లో

By Bojja Kumar

ప్రముఖ తెలుగు నటుడు మోహన్ బాబు ఎంజీఆర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. తమిళనాడు గవర్నర్ విద్యాసాగరరావు చేతుల మీదుగా ఆయన బుధవారం ఈ అవార్డు అందుకున్నారు. సినీ రంగానికి చేసిన సేవలకు గాను మోహన్ బాబుకు ఎంజీఆర్ వర్సిటీ గౌరవ డాక్టరేట్ ను ప్రదానం చేసింది.

తెలుగు సినిమా రంగంలో 40 సంవత్సరాల అనుభవం, 573కు పైగా సినిమాల్లో నటించిన మోహన్ బాబు ఇప్పటి వరకు 72 సినిమాలు నిర్మించారు. రాజ్యసభ సభ్యుడిగా పనిచేశారు. మోహన్ బాబు అసలు పేరు మంచు భక్తవత్సలం నాయుడు.

Dr. M Mohan Babu has been conferred honorary doctorate by MGR University

మోహన్ బాబు చిత్తూరు జిల్లా, ఏర్పేడు మండలం మోదుగులపాలెం లో 19 మార్చి 1952న జన్మించారు. మద్రాసులో సైన్స్‌లో డిగ్రీని పుచ్చుకొన్నారు, సినీరంగంలో ప్రవేశించడానికి ముందు కొంతకాలం వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేశారు. స్వర్గం నరకం (1975) చలన చిత్రంతో తెలుగు తెరకు పరిచమయ్యారు. ఈయన 2007లో పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X