»   » నటుడు డా. మోహన్ బాబుకు తాల్ పురస్కారం

నటుడు డా. మోహన్ బాబుకు తాల్ పురస్కారం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినిమా రంగంలో తనదైన విలక్షణ నటనతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న కలెక్షన్ కింగ్ డా.మోహన్ బాబుకు లండన్ తెలుగు సంఘం వారు తాల్ అవార్డు అందజేయనున్నారు. నటుడుగానే కాకుండా రాజకీయ నాయకుడిగా, నిర్మాతగా, విద్యావేత్తగా రాణిస్తూ బహుముఖ ప్ర‌జ్ఞాశాలిగా పేరు తెచ్చుకున్నారు.

అన్నీ రంగాల్లో తనదైన శైళిలో రాణిస్తున్న మోహన్ బాబుని లండన్ తెలుగు సంఘం(తాల్) వారు తాల్ హయ్యస్ట్ ప్రెస్టిజియస్ అవార్డుతో సత్కరించనున్నారు. మార్చి 28న లండన్ నగరంలో జరిగే 10వ ఉగాది వార్షికోత్సవ సంబరాల సందర్భంగా మోహన్ బాబుకి ఈ అవార్డుని బహుకరించనున్నారు.

Dr. Mohan Babu To Be Felicitated By TAL

2005లో స్థాపించబడిన ఈ లండన్ తెలుగు సంఘం అక్కడ తెలుగు భాషను, తెలుగు సంప్రదాయాలను అభివృద్ధి చేస్తూ తెలుగు అభ్యున్నతికి తోడ్పడుతుంది. ప్రతి సంవత్సరం తెలుగు ఉగాది వేడుకలను సెలబ్రేట్ చేయడమే కాకుండా వివిధ రంగాల్లో ప్రతిభ కనపరిచిన వారికి అవార్డులను బహుకరిస్తుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం డా. మోహన్ బాబుకి అవార్డును అందజేస్తున్నారు.

English summary
Dr. Mohan Babu Manchu widely acknowledged for his contribution to the field of entertainment, education and arts is being felicitated by the Telugu Association of London (TAL) London’s highest honor.
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu