»   » చిరంజీవికి, మోహన్ బాబుకి ఉన్న వ్యాల్యూ నాకు మాత్రం లేదా....!?

చిరంజీవికి, మోహన్ బాబుకి ఉన్న వ్యాల్యూ నాకు మాత్రం లేదా....!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓ హీరో సభ్యుల మీద దాడికి దిగినంత పని చేసాడట. ఇంతకీ ఈ హీరోగారి ఆగ్రహానికి కారణమేంటంటే..ఇటీవల డా డి. రామానాయుడు కు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఓ సన్మాన సభ ఏర్సాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు ఆహ్వానించడానికి ప్రింట్ అయిన ఆహ్వానితుల పేర్లులో తన పేరు లేకపోవడమేనని తెలుస్తోంది. యాక్ట్ చేయని చిరంజీవి, మోహన్ బాబులాంటి వారి పేర్లు వేసి యాక్ట్ చేస్తున్న తన పేరు వేయకపోవడంపై ఈ మీరో అగ్గిలం మీద గుగ్గిలం అయ్యి మురళీమోహన్ ని నిలదీసి నా పేరెందుకు వేయలేదని అతని చొక్కా పట్టుకుని గట్టిగానే అడిగినట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. ఈ హీరో మెగాస్టార్ పేరు ఎత్తితే భార్యతో సహా కలిసి మెగాస్టార్ మీద దుమ్మెత్తి పోస్తాడు. ఇక ఇప్పుడ అర్థమయ్యుంటుంది ఈ హీరో ఎవరనేది. అదేనండీ యాంగ్రీయంగ్ మెన్ జీవితా రాజశేఖర్ అని.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu