'మహంకాళి' అవతారమెత్తుతున్న రాజశేఖర్
ఒకప్పుడు యాక్షన్ చిత్రాలకు కేరాఫ్ గా నిలిచిన రాజశేఖర్ తాజాగా "మహంకాళి" అనే చిత్రం చేస్తున్నారు. అక్టోబర్ 18 నుంచి ఈ చిత్రం ప్రారంభం అవుతోంది. యేలూరు సురేంద్రరెడ్డి, ఎ పరంధామ రెడ్డి సంయుక్తంగా నిర్మించే ఈ చిత్రం ద్వారా కార్తికేయ అనే దర్శకుడు పరిచయం అవుతున్నాడు. అలాగే ఈ చిత్రంలో రాజశేఖర్..మహంకాళి అనే ఎన్ కౌంటర్ స్పెషలిస్టుగా చేస్తున్నారు. అలాగే ఓ టాప్ హీరోయిన్ ఈ చిత్రం చేయటానికి కమిటయిందన్నారు. ఇక ఈ చిత్రం మొత్తం సింగిల్ షెడ్యూల్ లో పూర్తి చేస్తామని, సినిమాలో ప్రాధనమైన భాగాన్ని బ్యాంకాక్ లో షూట్ చేస్తామని నిర్మాతలు చెప్తున్నారు. ఇక ఈ చిత్రంలో ప్రదీప్ రావత్, సలీమ్ పండా, ఆర్ కె, ఆషిష్ విద్యార్ధి, మురళీ శర్మ, సుప్రీత్, పిడి రాజు వంటి వారు నటిస్తున్నారు. పి.జి వింద కెమెరా అందిస్తుంటే చిన్న సంగీతం సమకూరుస్తారు.


Click it and Unblock the Notifications











