గతంలో గోపిచంద్ తో రణం వంటి వినోదాత్మక చిత్రం రూపొందించిన అమ్మరాజశేఖర్ తాజాగా మరో చిత్రం ప్లాన్ చేస్తున్నారు. డా.రాజశేఖర్ హీరోగా 'మోనార్క్'అనే టైటిల్ తో ఓ చిత్రం తెరకెక్కనుంది. ఈ విషయాన్ని మీడియాకు రాజశేఖర్ తెలియచేస్తూ...ఈ చిత్రాన్ని నా పుట్టినరోజు కానుకగా భావిస్తున్నాను. ఈ తరహా పాత్ర నేను ఇప్పటి వరకూ పోషించలేదు. వినోదానికి పెద్దపీట వేశారు. యాక్షన్ అంశాలు ఆకట్టుకుంటాయని అన్నారు. తదనంతరం దర్శకుడు అమ్మ రాజశేఖర్ మాట్లాడుతూ.. ''రణం' చిత్రానికి స్క్రీన్‌ప్లే ఆయువుపట్టులా నిలిచింది. ఈ చిత్రంలో అంతకుమించిన గొప్ప స్క్రీన్‌ప్లే ఉంటుంది. రాజశేఖర్‌కి మాత్రమే సరిపోయే కథ ఇది. ఇందులో ఇంకో ప్రముఖ హీరో కూడా కూడా నటిస్తారని అన్నారు. ఈ చిత్రాన్ని శీనయ్య నిర్మిస్తున్నారు.