టాలీవుడ్‌లో దారుణమైన కల్చర్.. అసలు సంస్కారమే లేదు.. రాజశేఖర్ ఫైర్

హీరో రాజశేఖర్ ఇటీవలే మరోసారి కారు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో రాజశేఖర్ స్వల్ప గాయాలతో బయటపడినప్పటికీ, ఆయన మాత్రం నుజ్జు నుజ్జయింది. ప్రమాదం తాలూకు ఫొటోలు చూస్తుంటే రాజశేఖర్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని స్పష్టంగా తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదం తర్వాత మీడియాతో మాట్లాడిన రాజశేఖర్.. టాలీవుడ్ చిత్రసీమపై చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వివరాల్లోకి పోతే..

రామోజీ ఫిల్మ్ సిటీ దాటగానే..

రామోజీ ఫిల్మ్ సిటీ దాటగానే..

విజయవాడలో జరిగిన ఓ కార్యాక్రమానికి వెళ్లిన రాజశేఖర్.. తిరుగు ప్రయాణం చేస్తుండగా ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి వస్తూ రామోజీ ఫిల్మ్ సిటీ దాటిన తరువాత నేరుగా జూబ్లీహిల్స్‌కు చేరుకునే క్రమంలో అవుటర్ రోడ్డు ఎక్కిన రాజశేఖర్ కారు ప్రమాదానికి గురి కావడంతో ఆయన అభిమానులు కాస్త ఆందోళన చెందారు.

పోలీసులు ఏమన్నారంటే..

పోలీసులు ఏమన్నారంటే..

రాజశేఖర్ కారు ప్రమాద స్థలానికి వెళ్లి పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టి కొన్ని విషయాలు చెప్పారు. అతివేగం, నిర్లక్ష్యంగా డ్రైవ్ చేయడం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని రిపోర్ట్ ఇచ్చారు. ప్రమాదంపై సెక్షన్ ఐపీసీ 279 కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. పూర్తి విచారణ జరిపాక తదుపరి సమాచారం అందజేస్తామని పోలీసులు అన్నారు.

Recommended Video

Hero Rajasekhar Met With A Car Mishap || హీరో రాజశేఖర్‌ కారు బోల్తా! ||
 రాజశేఖర్ క్లారిటీ.. ఎదురుగా వస్తున్న కారులో

రాజశేఖర్ క్లారిటీ.. ఎదురుగా వస్తున్న కారులో

కారు ప్రమాదం జరిగిన కొన్ని గంటల తర్వాత క్షేమంగా ఇంటికి చేరిన రాజశేఖర్ ఈ ప్రమాదంపై స్పందించారు. "మంగళవారం రాత్రి రామోజీ ఫిల్మ్ సిటీ నుండి ఇంటికి వస్తుండగా ఔటర్ రింగు రోడ్డులో పెద్ద గోల్కొండ అప్పా జంక్షన్ వద్ద నా కారు ప్రమాదానికి గురైంది. అప్పుడు కారులో నేను ఒక్కడినే ఉన్నాను. ఎదురుగా వస్తున్న కారులో వారు ఆగి, నా కారు దగ్గరకు వచ్చారు. వారి సహకారంతో నాయటపడ్డా'' అని చెప్పారు.

దారుణమైన కల్చర్.. రాజశేఖర్ మండిపాటు

దారుణమైన కల్చర్.. రాజశేఖర్ మండిపాటు

ఆ తర్వాత అభిమానుల ప్రార్థనల వల్లే తాను బతికానని చెప్పుకొచ్చిన రాజశేఖర్.. సినీ ఇండస్ట్రీపై సంచలన వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ అయింది. ఈ మధ్య టాలీవుడ్‌లో ఓ దారుణమైన కల్చర్ వచ్చిందని.. చచ్చినా కూడా మనుషులు పట్టించుకోలేని సంస్కార హీనంగా మారిపోతున్నారని రాజశేఖర్ మండిపడ్డారు. దీంతో రాజశేఖర్ కామెంట్స్‌పై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

మరిన్ని చర్చలకు తావిచ్చేలా..

మరిన్ని చర్చలకు తావిచ్చేలా..

ప్రమాదం జరిగిన తర్వాత ఏ హీరో కానీ, హీరోయిన్ కానీ స్పందించకపోవడం రాజశేఖర్‌ని బాధ పెట్టిందని.. అందుకే ఆయన ఇలా మాట్లాడారని అంటున్నారు కొందరు. ఇక తెలుగు ఇండస్ట్రీలో కనీసం చచ్చిపోతే కూడా పట్టించుకోలేని మనుషులు ఉన్నారంటూ రాజశేఖర్ ఫైర్ కావడం మరిన్ని చర్చలకు తావిస్తోంది .

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X