అయ్యారే లో స్వామి 'రాజానంద' శృంగారానికి రెడీ అయ్యారు..!
డా. రాజేంద్రప్రసాద్, శివాజి, సాయికుమార్, అనీషాసింగ్ ప్రధాన పాత్రధారులుగా ప్రీతమ్ ప్రోడక్షన్స్ పతాకంపై డా.బి. సుధాకర్ బాబు, రంగన అచ్చప్ప నిర్మిస్తున్న చిత్రం 'అయ్యారే'. సాగర్ చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ కోత్త కధాంశంతో రూపోందుతున్న ఈ చిత్రం తప్పకుండా ప్రేక్షకులకి నచ్చుతుందన్నారు.
ఇందులో నా క్యారెక్టర్ ఎటిఎమ్ సెంటర్ వద్ద గార్దుగా ఉద్యోగం చేసే వ్యక్తి స్వామిజీ ఎలా మారాడు అనే దాని చుట్టూ తిరుగుతుంది. నేను ఈ చిత్రంలో స్వామిజీ గా కనిపిస్తాను. ఈ స్వామిజీ చేసే పనులు చూసి అందరూ హాయిగా నవ్వుకుంటారు. అభినయానికి ఆస్కారమున్న పాత్ర అని అన్నారు. శివాజి మాట్లాడుతూ కోత్త కధాంశం తో రూపోందుతున్న ఈ చిత్రాన్ని మీ అందరూ తప్పక చూసి మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను. డా. రాజేంద్రప్రసాద్ గారితో కలసి నటించడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ప్రస్దానం తర్వాత మళ్శీ మంచి పాత్రలో చేసే అవకాశం కలిగిందని సాయికుమార్ అన్నారు. రాజేంద్రప్రసాద్ గారిని చూస్తుంటే ఇటీవల ఒక స్వామిజీ తన భక్తురాలితో శృంగారం నడిపిన తీరు గుర్తుకువస్తుంది. మరి సినిమాలో ఈ స్వామిజీ ఏ భక్తురాలితో శృంగారం చేస్తారో చూడాలంటే సినిమా వచ్చేంత వరకు ఆగాల్సిందే...


Click it and Unblock the Notifications











