రాజేంద్రప్రసాద్ ‘నాన్నా బూచి’
హైదరాబాద్ : ఒకప్పుడు కమెడీ హీరోగా తెలుగు ప్రేక్షకులను నవ్వించిన రాజేంద్రప్రసాద్.....ఇప్పుడు తన వయసుకు తగిన పాత్రలు చేస్తూ, విభిన్నమైన, సమాజాన్ని ఆలోచింప చేసే చిత్రాలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న సంగతి తెలిసిందే. ఆ నలుగురూ, మీ శ్రేయోభిలాషి లాంటి చిత్రాలు ఆ కోవలోకే వస్తాయి.
తాజాగా రాజేంద్రప్రసాద్ హీరోగా రూపొందనున్న చిత్రం 'నాన్నా బూచి'. విజయ్‌కట్ల దర్శకుడు. తటవర్తి మీడియా పతాకంపై బేబీ స్ఫూర్తి సమర్పణలో సుధాకర్, కె.శంకర్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు విజయ్ కట్ల మాట్లాడుతూ ఈ చిత్రం మంచి ఉద్దేశ్యంతో రూపొందిస్తున్నట్లు తెలిపారు.
'చైల్డ్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సస్పెన్స్ థ్రిల్లర్ ఇది. ఇందులో రాజేంద్రప్రసాద్ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉంటుంది' అని దర్శకుడు చెప్పారు. నిర్మాతలు సుధాకర్, కె.శంకర్‌రెడ్డి మాట్లాడుతూ- 'జూన్ 1 నుంచి హైదరాబాద్‌లో చిత్రీకరణ మొదలవుతుంది. రెండు షెడ్యూల్స్‌లో చిత్రాన్ని పూర్తి చేస్తాం. ఇందులో నాలుగు పాటలుంటాయి'అని తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం: మహతి, స్క్రీన్‌ప్లే: మాధవ, కథ-దర్శకత్వం: విజయ్‌కట్ల.


Click it and Unblock the Notifications












