శ్రీదేవి ఫ్యాన్స్ కు పండుగరోజు
శ్రీదేవి అంటే ఇష్టపడని వారంటు ఉండరు. జూనియర్ శ్రీదేవి కాదందడి బాబు, 'జగదేక వీరుడు అతిలోక సుందరి" సినిమాలో దేవలోకంలోంచి భువికి దిగివచ్చిన దేవకన్యలా ఉంటుందంటారంతా ఆ శ్రీదేవి. తన అందచందాలతో, హావభావాలతో అన్ని తరాల ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న జాతీయనటి శ్రీదేవి తెలుగు తార కావడం మనందరికి గర్వకారణం.
తెలుగు ప్రేక్షకులకు కుందనాల బొమ్మగా కనిపించినా...బాలీవుడ్ వారికి డ్రీమ్ గర్ల్ శ్రీదేవి 13 ఆగస్టు 1963లో మద్రాసులో జన్మించింది.తన ఐదేళ్ల ప్రాయంలోనే చిత్రరంగ ప్రవేశం చేసి బాలనటిగా ఔరా అనిపించుకుంది. 'బడిపంతులు" చిత్రంలో యన్‌టిఆర్‌కి మనవరాలుగా నటించిన శ్రీదేవి అనంతరం హీరోయిన్ అయ్యాక ఆయనకు జోడీగా ఎన్నో సూపర్‌హిట్ చిత్రాల్లో నటించి మంచిపేరు సంపాదించుకుంది. 'పదహారేళ్ల వయసు"లో హీరోయిన్‌గా చేసి తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యింది. ప్రముఖనిర్మాత బోనీకపూర్ తో వివాహం అనంతరం శ్రీదేవి సినిమాలకు దూరంగా ఉంది. వారికి జాహ్నవి, కుషి అని ఇద్దరు ఆడపిల్లలున్నారు. ఇద్దరు పిల్లల తల్లి అయినా ఇప్పటికి చెక్కుచెదరని అందంతో కనిపించే శ్రీదేవి పుట్టిన రోజు నేడు ఈ సందర్భంగా 'దట్స్ తెలుగు" తరపున జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నది.


Click it and Unblock the Notifications











