'గంగామాత' గా హాలీవుడ్ నటి డ్రూ బెరీ మోర్
బాలీవుడ్ హీరోయిన్ డ్రూ బెరీ మోర్ త్వరలో గంగా మాతగా కనిపించనుంది. ఇండియాలో కూడా చాలా పాపులర్ కావటంతో క్రేజ్ ని క్యాష్ చేసుకునేందుకో మరెందుకో గానీ ఆమెను తాజాగా ది లైప్ స్టైల్..ఇన్ జెనరేషన్ నెక్ట్స్ అనే చిత్రంలో ఓ కీలకమైన పాత్రకు తీసుకున్నారు. బాలీవుడ్ డైరక్టర్ కమ్ ప్రొడ్యూసర్ అయిన సంతోష్ కుమార్ జైన్ ఈమెను కలిసి కథ వినిపించి ఒప్పించాడు. ఇక ఈ చిత్రం గంగా నది బ్యాక్ డ్రాప్ లో జరగే ఉమెన్ ఓరియెంటెడ్ సినిమా. ఇక ఇద్దురు బాలీవుడ్ లీడ్ ఏక్టర్స్ ఈ చిత్రంలో నటించనున్నారు. ఇక గంగా మాత గా డ్రూ బెరీమోర్ కనపించనుంది. ఈ చిత్రం దాదాపు 150 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మతమవుతోంది. అలాగే అవతార్ చిత్రంలో జేమ్స్ కెమెరాన్ వాడిన టెక్నాలిజీ ని ఈ చిత్రానికి వాడుతున్నామని నిర్మాత చెప్తున్నారు. హరిద్వార్, యూరప్, నార్త్ అమెరికాల్లో ఈ చిత్రం షూటింగ్ ప్లాన్ చేస్తున్నారు. నవంబర్ లో ఈ చిత్రం ప్రారంభం కానుంది. రామ్-లక్ష్మణ్ లు ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.


Click it and Unblock the Notifications











