Don't Miss!
- Sports
టీ20ల్లో టాప్ ప్లేయర్లు.. వన్డేల్లో మాత్రం వేస్ట్.. టీమిండియా స్టార్ కూడా!
- Lifestyle
ఈ రాశుల వారు భగ్నప్రేమికులు, అలా పడిపోతారు ఇలా విడిపోతారు
- News
బండి సంజయ్ నియోజకవర్గం ఖరారు?
- Finance
Adani Enterprises FPO: అనుకున్నది సాధించిన అదానీ.. మూడో రోజు మ్యాజిక్.. ఏమైందంటే..
- Automobiles
అమరేంద్ర బాహుబలి ప్రభాస్ కాస్ట్లీ కారులో కనిపించిన డైరెక్టర్ మారుతి.. వీడియో వైరల్
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
దృశ్యం 2, చక్ర, నాందికి కోలుకోలేని దెబ్బ.. తమిళ్ రాకర్స్ హెచ్‌డీ ఫార్మాట్ లీక్
అన్ని భాషల్లో సంచలన విజయం సాధించిన దృశ్యం సినిమాకు సీక్వెల్‌గా ఇటీవల దృశ్యం2 ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. ఈ చిత్రంపై ప్రేక్షకులు పాజిటివ్ టాక్‌ను వ్యక్తం చేస్తున్నారు. థియేటర్‌లో రిలీజ్ కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో రిలీజైంది. అయితే ఈ సినిమాపై పైరసీ వెబ్‌సైట్ కోలుకోలేని దెబ్బ తీసింది. ఆ వివరాల్లోకి వెళితే..

అమెజాన్ ప్రైమ్‌లో దృశ్యం 2
దృశ్యం
2
సినిమా
విషయానికి
వస్తే
వాస్తవానికి
థియేటర్లో
రిలీజ్
కావాల్సింది.
అయితే
లాక్‌డౌన్
కాలంలో
అమెజాన్‌తో
ఒప్పందం
కుదిరినందు
వల్ల
సినిమాను
అమెజాన్‌లో
స్ట్రీమింగ్
చేశారు.
ఫిబ్రవరి
18వ
తేదీ
రాత్రి
ఈ
సినిమాను
ప్రేక్షకుల
ముందుకు
తీసుకొచ్చారు.

మోహన్‌లాల్ స్పందిస్తూ
దృశ్యం 2 సినిమాపై ప్రేక్షకులు, సినీ విమర్శకులు కురిపిస్తున్న ప్రశంసలపై హీరో మోహన్‌లాల్ స్పందించారు. సోషల్ మీడియాలో వెల్లువిరిస్తున్న కామెంట్లపై స్పందిస్తూ.. దృశ్యం 2 సినిమాపై వస్తున్న రెస్పాన్స్ చూసి ఆనందంలో మునిగిపోయాను అంటూ ఆయన పేర్కొన్నారు.

ఆన్‌లైన్‌లో దృశ్యం 2 లీక్
అయితే ప్రేక్షకులు నుంచి విశేషమైన స్పందన వస్తున్న నేపథ్యంలో దృశ్యం2 సినిమాపై తమిళ రాకర్స్ పంజా విసిరింది. ఈ చిత్రానికి సంబంధించిన పైరసీ కాపీని తన వెబ్‌సైట్స్‌లో ఉంచింది. హెచ్ డీ ప్రింట్ డౌన్‌లోడ్ ఆప్షన్ ఇవ్వడంతో అమెజాన్‌కు భారీగా నష్టం వాటిల్లే అవకాశం ఉంది.

నాంది, పొగరు, చక్రకు తప్పని లీకుల బెడద
కేవలం దృశ్యం సినిమానే కాకుండా ప్రస్తుత వారంలో విడుదలైన నాంది, చక్ర, పొగరు లాంటి సినిమాలను పైరసీ చేసి మరోసారి నిర్మాతలకు, చిత్ర యూనిట్‌కు తమిళ్ రాకర్స్ సవాల్ విసింది. గతంలో తమిళ్ రాకర్స్ లీకేజ్‌లపై విశాల్ యుద్దం ప్రకటించిన సంగతి తెలిసిందే.