twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలుగులో నదియా పాత్రని.. హిందీ లో టబు చేస్తోంది

    By Srikanya
    |

    ముంబై : ముచ్చటగా ఉండే ఇద్దరు కూతుళ్లు, మనసెరిగి నడుచుకునే భార్యతో అతగాడి జీవితం సాఫీగా సాగుతుంటుంది. కానీ, పెద్ద కూతురి జీవితంలో రేగిన కలకలంతో ఆ కుటుంబం ఎలా తల్లడిల్లిందనే కథాంశంతో రూపొందిన మలయాళ చిత్రం 'దృశ్యం'. ఏ భాషకైనా నప్పే కథతో రూపొందిన ఈ చిత్రం తెలుగులో వెంకటేశ్, మీనా జంటగా పునర్నిర్మితమై ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇప్పుడు హిందీలోకి వెళ్తోంది.

    మలయాళ, తెలుగు ప్రేక్షకులను అలరించిన వైవిధ్యమైన చిత్రం 'దృశ్యం'. ఇప్పుడీ సినిమా తమిళ, హిందీ సీమల్లో అడుగుపెడుతోంది. తెలుగు, మలయాళ వెర్షన్లలో మంచి పేరు తెచ్చుకున్న పాత్రలో ఐజీ పాత్ర ఒకటి. మలయాళంలో ఆశా శరత్‌, తెలుగులో నదియా ఈ పాత్రలో కనిపించారు. త్వరలో ప్రారంభం కానున్న హిందీ వెర్షన్‌లో ఐజీ పాత్రలో టబు నటిస్తోంది. అజయ్‌ దేవగణ్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్న ఈ చిత్రానికి నిశికాంత్‌ కామత్‌ దర్శకుడు. గతంలో 'లాయి బిహారి' వంటి సినిమాతో వైవిధ్యమైన దర్శకుడిగా పేరుతెచ్చుకున్నారీయన.

    ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు
    మలయాళంలో మోహన్‌లాల్, మీనా ప్రధాన పాత్రల్లో నటించిన దృశ్యం అక్కడ పెద్ద విజయం సాధించగా....తెలుగులో వెంకటేష్ తో రీమేక్ చేస్తే కూడా బాగా వర్కౌట్ అయింది. దీంతో తమిళంలో కమల్ హాసన్ హీరోగా తమిళ రీమేక్ కూడా స్టార్ట్ అయింది. త్వరలో ఈచిత్రం హిందీలో కూడా రీమేక్ ప్రారంభం కాబోతోంది. నిషికంట్ కామత్ ఈ సినిమాకు దర్శకుడు. వయకామ్18 సంస్థ నిర్మిస్తుంది.

    Drishyam hindi re-make starts

    తమిళ దృశ్యాన్ని కమల్, గౌతమీ లు ముఖ్యపాత్రధారులు. తమిళంలో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఈ చిత్రానికి అక్కడ 'దృశ్యం'టైటిల్ తో కాకుండా 'పాపనాశం' అనే టైటిల్ ఖరారు చేశారు. మలయాళ చిత్రానికి దర్శకత్వం వహించిన జీతు జోసఫ్ తమిళ చిత్రానికి కూడా దర్శకత్వం వహిస్తారు.

    చిత్రం కథేమిటంటే...
    తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది. అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు.

    దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్ లో వాడు..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్ లు వేసి , తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.

    మరో ప్రక్క....

    ఇప్పటికే 'దృశ్యం' నిర్మాతలకు బాలీవుడ్ నిర్మాత ఏక్తాకపూర్ లీగల్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. జపనీస్ రచయిత కీగో హిగాషినో రాసిన పుస్తకంలోని విషయాలను కాపీ కొట్టి 'దృశ్యం' చిత్రాన్ని తెరకెక్కించారని ఏక్తా కపూర్ తన నోటీసుల్లో పేర్కొన్నారు. జపనీస్ రచయిత రాసిన 'ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్' పుస్తకం ఆధారంగా సినిమా తెరకెక్కించేందుకు ఏక్తా కపూర్ ఆ పుస్తకం రైట్స్ కొనుగోలు చేసారు. అయితే 'దృశ్యం' చిత్రం చూసిన ఏక్తా కపూర్ అండ్ టీం తాము రైట్స్ దక్కించుకున్న పుస్తకంలోని విషయాలతో 'దృశ్యం' సినిమా ఉండటంతో షాక్‌కు గురైందట.

    English summary
    The remake of Drishyam in Hindi is all set to hit the floors soon. Tabu is going to play the role of police officer and Ajay Devgn is playing the lead role in the movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X