twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ‘దృశ్యం’ ప్రీమియర్ షో: సెలబ్రిటీల పొగడ్తలు (ఫోటోస్)

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన 'దృశ్యం' ఈ నెల 11న విడుదలవుతున్న నేపథ్యంలో రెండు రోజుల ముందుగానే ప్రముఖుల కోసం ఈ చిత్రం ప్రీమియర్ షోను ఏర్పాటు చేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన పలువురు ప్రముఖులు సినిమా బాగుందంటూ పొగడ్తల వర్షం కురిపించారు.

    నిర్మాత సురేష్ బాబు మాట్లాడుతూ ఇదొక ఫ్యామిలీ థ్రిల్లర్. ఫ్యామిలీలో ప్రతి ఒక్కరూ చూడదగ్గ సినిమా అని తెలిపారు. వెంకటేష్ మాట్లాడుతూ ఈ సినిమా ప్రతి ఒక్కరికీ నచ్చే విధంగా ఉంటుంది. అందరూ ఎంతో బాగా నటించారు. టెక్నీషియన్స్ అంతా కష్టపడి పని చేసారు అని తెలిపారు.

    మీనా మాట్లాడుతూ...'దృశ్యం' చిత్రం ద్వారా తెలుగులో మళ్లీ సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నాను. ఇంత మంచి సినిమాతో మళ్లీ తెలుగులో ఎంట్రీ ఇస్తున్నందుకు ఆనందంగా ఉంది అని తెలిపారు. స్లైడ్ షోలో ప్రీమియర్ షోకు సంబంధించిన ఫోటోలు...

    దృశ్యం ప్రీమియర్ షో..

    దృశ్యం ప్రీమియర్ షో..

    దృశ్యం మూవీ ప్రీమియర్ షోకు హాజరైన పలువురు తెలుగు సినిమా ప్రముఖులు. నడుటు నరేష్, పరుచూరి బ్రదర్స్, సమీర్ తదితరులు ఈ ప్రీమియర్ షోకు హాజరయ్యారు.

    నిర్మాణ సంస్థలు

    నిర్మాణ సంస్థలు

    ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్‌ థియేటర్స్‌, సురేష్‌ ప్రొడక్షన్స్‌, వైడ్‌ యాంగిల్‌ క్రియేషన్స్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రాజ్‌కుమార్‌ సేతుపతి నిర్మాత. డి.సురేష్‌బాబు సమర్పకులు.

    మీనా

    మీనా

    ఒకప్పుడు తెలుగులో బిజీ హీరోయిన్ అయిన మీనా...చాలా కాలం తర్వాత మళ్లీ ‘దృశ్యం' చిత్రం ద్వారా తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది.

    దగ్గుబాటి అభిరామ్

    దగ్గుబాటి అభిరామ్

    ‘దృశ్యం' ప్రీమియర్ షోకు హాజరైన నిర్మాత సురేష్ బాబు చిన్న కుమారుడు దగ్గుబాటి అభిరామ్.

    నరేష్

    నరేష్

    తెలుగు నటుడు నరేష్ ‘దృశ్యం' ప్రీమియర్ షోకు హాజరయ్యాడు. అనంతరం మాట్లాడుతూ ఈ చిత్రం ట్రెండ్ సెట్టర్ మూవీ అవుతుందని అన్నారు.

    English summary
    Drishyam Movie premiere show press meet held at hyderabad. The movie starring Venkatesh, Meena, Kritika and directed by Sripriya.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X