హిట్ ఎఫెక్ట్: ‘దృశ్యం’ శాటిలైట్ రైట్స్ అదిరాయ్
హైదరాబాద్: వెంకటేష్, మీనా ప్రధాన పాత్రధారులుగా శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కిన 'దృశ్యం' చిత్రం ఇటీవల విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. సినిమాకు ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఎక్కువగానే వస్తుండటంతో దర్శకత నిర్మాతలు సంతోషంగా ఉన్నారు.
తాజాగా ఈ చిత్రానికి శాటిలైట్స్ కూడా భారీగానే వచ్చినట్లు తెలుస్తోంది. ఓ ప్రముఖ తెలుగు ఛానల్ ఈ చిత్రానికి రూ. 6 కోట్లు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఫ్యామిలీ ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షిస్తుండటంతో ఈ చిత్రానికి బుల్లితెరపై మంచి స్పందన వస్తుందని ఆశిస్తున్నారు. అందుకే శాటిలైట్ రైట్స్ భారీగా వచ్చినట్లు తెలుస్తోంది.

చిత్రం కథ విషయానికి వస్తే...తన ఊళ్లో కేబుల్ నడుపుకుంటున్న రాంబాబు(వెంకటేష్) కి తను చూసే సినిమాలు, తన భార్య(మీనా) పిల్లలే లోకం. తన జీవితంలో వచ్చే సమస్యలకు తను చూసిన సినిమాల్లోంచే పరిష్కారాలు వెతుక్కునే అతను ఊహించని సమస్యని ఎదుర్కోవాల్సి వస్తుంది.
అతని కుమార్తె అంజు బట్టలు మార్చుకునేటప్పడు...సెల్ లో వీడియో తీసి వరుణ్ అనే కుర్రాడు బ్లాక్ మెయిల్ చేస్తూంటాడు. దాన్ని నుంచి తప్పించుకునే ప్రాసెస్‌లో వరుణ్..అంజు చేతిలో ప్రాణాలు కోల్పోతాడు. వరుణ్ ... ..పోలీస్ ఐజీ గీతా ప్రభాకర్ (నదియా) కొడుకు. ఈ విషయం తెలుసుకున్న రాంబాబు ఏం చేసాడు. ఏ విధంగా ప్లాన్‌లు వేసి, తన కుటుంబాన్ని వేటాడటానికి సిద్దమైన పోలీస్ డిపార్టమెంట్ నుంచి కాపాడుకున్నాడు అనేది ఉత్కంట కలిగించే కథనం.


Click it and Unblock the Notifications











