దృశ్యం టీంతో సందడి చేసిన రామానాయుడు (ఫోటోస్)
హైదరాబాద్: సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన 'దృశ్యం' చిత్రం ఈ నెల 11న విడుదలై మంచి విజయం సాధించిన నేపథ్యంలో హైదరాబాద్‌లోని దసపల్లా హోటల్‌లో సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు. ఈ వేడుకలో నిర్మాత డి రామానాయుడు పాల్గొని కేక్ కట్ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న మా సంస్థలో ఈ గోల్డెన్ ఇయర్లో లేడీ డైరెక్టర్ సినిమాకు దర్శకత్వం వహించడం ఆనందించదగ్గ విషయం అన్నారు. సినిమా కథ విన్నపుడే హిట్టవుతుందని చెప్పాను. నా అంచనా నిజమైందని రామానాయుడు చెప్పుకొచ్చారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు.
చిత్ర నిర్మాత డి సురేష్ బాబు మాట్లాడుతూ...సినిమా క్రిటికల్ అక్లెయిమ్ సాధించడంతో పాటు మంచి కలెక్షన్స్ వసూలు చేసిందని చెప్పారు. సినిమా సక్సెస్‌లో భాగమైన అందరికీ థాంక్స్ చెప్పారు. స్లైడ్ షోలో ఫోటోలు మరిన్ని వివరాలు...

వెంకటేష్
తన 27 ఏళ్ల కెరీర్లో ఇదొక వండర్ ఫుల్ సినిమా అని, సినిమా విజయం సాధించాక కాన్ఫిడెన్స్ మరింత పెరిగిందన్నారు. ఇలాంటి మంచి సినిమాలు మరిన్నిచేస్తానన్నారు.

దర్శకురాలు శ్రీప్రియ
దర్శకురాలు శ్రీప్రియ మాట్లాడుతూ...సురేష్ ప్రొడక్షన్స్ బేనర్లో హీరోయిన్‌గా నటించిన తాను ఇదే బ్యానర్లో దర్శకురాలిగా చేయడం సంతోషంగా ఉంది. సంస్థ 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నేను చేసిన సినిమా హిట్ కావడం మరింత సంతోషకరమైన విషయం అన్నారు.

మీనా, కృతిక
‘దృశ్యం' సినిమా సక్సెస్ మీట్లో పాల్గొన్న మీనా, కృతిక.

రామానాయుడు, శ్రీప్రియ
‘దృశ్యం' మూవీ సక్సెస్ మీట్లో దర్శకురాలు శ్రీప్రియతో ముచ్చటిస్తున్న నిర్మాత రామానాయుడు.

అభిరామ్‌కి కేక్..
‘దృశ్యం' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా తన మనవడు అభిరామ్‌కి కేక్ తినిపిస్తున్న డి రామానాయుడు.

వెంకటేష్‌కి కేక్...
‘దృశ్యం' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా తన తనయుడు వెంకటేష్ కి కేక్ తినిపిస్తున్న డి రామానాయుడు.

మీనాకి కేక్
‘దృశ్యం' సినిమా సక్సెస్ మీట్ సందర్భంగా హీరోయిన్ మీనాకి కేక్ తినిపిస్తున్న డి రామానాయుడు.

దృశ్యం
‘దృశ్యం' సినిమా సక్సెస్ మీట్‌కి హాజరైన చిత్ర నటీనటులు

సక్సెస్ మీట్..
‘దృశ్యం' సినిమా సక్సెస్ మీట్లో నదియా, నరేష్, రవి కాలే, కృతిక, ఎస్తర్, సమీర్ , బెనర్జీ, పరుచూరి గోపాలకృష్ణ, సప్తగిరి, జోగినాయుడు, కృష్ణ చైతన్య, స్వామి, గోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Click it and Unblock the Notifications











