ఎన్టీఆర్ సూపర్ హిట్ సాంగ్ ని రీమిక్స్ చేస్తున్న రవితేజ
ఎన్టీఆర్ నటించిన 'డ్రైవర్ రాముడు"లోని 'మామిళ్ల తోట కాడ పండిస్తే..." అనే పాట ఎంత సూపర్ హిట్టో అందరికీ తెలిసిందే.ఈ పాటను రవితేజ తాజా చిత్రం 'వీర" కోసం రీమిక్స్ చేశారు.రవితేజ, కాజల్ అగర్వాల్, తాప్సీ కాంబినేషన్‌లో రమేష్‌వర్మ దర్శకత్వంలో గణేష్ ఇందుకూరి నిర్మిస్తున్న 'వీర" చిత్రం ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా సంగీత దర్శకుడు తమన్ ఈ విషయాన్ని తెలియచేస్తూ...మామూలుగా రీమిక్స్ పాటలకు దూరంగా ఉండే నేను ఈ చిత్రం కోసం 'డ్రైవర్ రాముడు"లోని 'మామిళ్ల తోట కాడ పండిస్తే..." అనే పాటను రీమిక్స్ చేశాను. సందర్భానుసారం ఈ పాట సాగుతుంది. ఇది మంచి ఫీల్ ఉన్న చిత్రం. ఈ ఆడియో, సినిమా విజయం సాధిస్తాయనే నమ్మకం ఉంది. ఈ నెల 19న చిత్రం విడుదల కానుంది"" అన్నారు.
అలాగే ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ విదేశాల్లో జరుగుతున్నందుకు యూనిట్ సభ్యులందరూ అక్కడ ఉన్నారు. అందుకే ఆడియో వేడుకను నిరాడంబరంగా జరుపుతున్నాం. రవితేజతో నాకిది నాలుగో సినిమా. ఆ చిత్రాలకు ఇచ్చినట్లుగానే రవితేజ శారీరక భాషకు తగ్గట్టుగానే ఈ పాటలను చేశాను. ఇప్పటివరకు నగర నేపథ్యంలో రూపొందిన చిత్రాలకు పాటలిచ్చాను. అందుకని గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి పాటలివ్వడం సరికొత్త అనుభూతినిచ్చింది అన్నారు. ఆడియో సీడీని చిత్ర సంగీతదర్శకుడు ఎస్.ఎస్. తమన్ విడుదల చేసి గోపిచంద్ మలినేనికి ఇచ్చారు. ఆదిత్య ద్వారా ఆడియో విడుదలైంది.


Click it and Unblock the Notifications











