twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    బిగ్ స్టార్స్...బిగ్ ఎక్సెపెండిచర్..బిగ్ ఫ్లాఫ్

    By Staff
    |

    Drona
    అభిషేక్ బచ్చన్, ప్రియాంక చోప్రా ప్రధాన పాత్రలో భారీ ఖర్చుతో,అంతకు మించి పబ్లిసిటీతో గోల్డి భెల్ రూపొందించిన ద్రోణ నిన్న ప్రపంచమంతటా రిలీజయ్యింది. భారీ ఓపినింగ్స్ తెచ్చుకున్న ఈ సినిమా అంతే భారీగా ఫ్లాప్ ని భాక్సఫీస్ వద్ద నమోదు చేసింది. ఫాంటసీ,ఎడ్వెంచర్ ఫిల్మ్స్ బాలీవుడ్ లో అరుదే. అయితే క్రిష్ వచ్చినందువల్లో మెరందెకో గానీ ధైర్యమే చాసారు. అయితే ఈ సాహసానికి దర్శక,నిర్మాతలు పూనుకున్నా చెత్త స్క్రీన్ ప్లే సినిమాను నాశనం చేసేసింది.

    కథ ప్రకారం ఆదిత్య(అభిషేక్ బచ్చన్) ప్రేమంటే తెలియని అనాధగా ఓ పాస్టర్ కుటుంబం చేతిలో పెరుగుతాడు. అతనికి తంత్రాలు,మంత్రాలు అన్నీ అబ్బుతాయి. అయితే అతన్ని రిజ్ రైజవాడ(కె.కె.మీనన్) అనే పేరు గల విలన్ అతనని వెంటాడుతూంటాడు.విలన్ జీవిత లక్ష్యం అమృతం సాదించి మృత్యుంజయుడుగా మారటం. అయితే అమృతాన్ని సాదించాలంటే ద్రోణాని ఎదుర్కోవాలి. అయితే అతనికి ద్రోణా ఎవరో తెలియదు. కానీ ఓ రోజు ఆదిత్య ధరించిన డ్రస్ చూసి అతనే ద్రోణా అని గుర్తు పట్టి వేటాడటం ప్రారంభిస్తాడు. అయితే ఆదిత్యకి తానే ద్రోణా నని...తనే అమృత రక్షకుడుని అనే విషయం తెలియదు. ఈ ప్రయాణంలో అతన్ని సోనియా(ప్రియాంకా చోప్రా) బాడీ గార్డులా రక్షిస్తూంటుంది. తర్వాత ఆమే అతని అసలు జన్మ రహస్యం చెప్పి బర్త్ ప్లేస్ కి తీసుకెళ్తుంది. అక్కడ ఆదిత్య అతని తల్లి రాణీ జయతి దేవీ (జయా బచ్చన్) ని కలసుకుని తన రూట్స్ వెతుక్కోవటానికి బయిలు దేరతాడు. అయితే విలన్ అతన్ని ఈ లోగా పట్టేసి అడ్డగిస్తాడు. అక్కడ నుంచి తప్పించుకుని ఆదిత్య ఎలా విలన్ ని శిక్షించాడు,అమృతాన్ని ఎలా రక్షిస్తాడనేది మిగతా కథ.

    ఎక్కవగా గ్రాఫిక్స్ మీద ఆధారపడిన ఈ సినిమాలో రెండు సీక్వెన్స్ అవుట్ స్టాండిగ్ లో కనపడి అబ్బురమనిపిస్తాయి. అవి ట్రైన్ సీక్వెన్స్, జయా బచ్చన్ శిల గా మారే సన్నివేశం ఒకటి. అలాగే ప్రియాంక ఇంట్రడక్షన్ సన్నివేశం అధ్బుతమనిపిస్తుంది. ఇక ఎక్కువ విజువల్స్ పైనే ఆదారపడే క్రమంలో జరిగిన ఈ పొరపాటుకి బయ్యర్లు ,డిస్ట్రిబ్యూటర్స్ భారీ మూల్యమే చెల్లించాల్సి ఉంటుందంటున్నారు. అప్పటికీ ముగ్గురు రచయితలు జయదీప్ సర్కార్,రోహిణి,గోల్డ్ భెల్ కలసి ఈ స్క్రిప్టుని తయారుచేసారు.ఈ కథలో ద్రోణా సూపర్ హీరోనా లేక ఫాంటసీ హీరోనా అన్నది స్పష్టం చేయకపోవటమే కథ పరంగా ప్రధాన సమస్యగా తయారైంది.అలాగే విలన్ గా చేసిన కె.కె.మీనన్ పాత్ర బఫూన్ కన్నా మరింత తక్కువ స్ధాయిలో ఉండటం సినిమాని మరింతగా దిగజార్చింది.యేదైమైనా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవటంలో విఫలం కావటం బాలీవుడ్ భారీ తనానికి మరో సారి చెక్ చెప్పినట్లయింది.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X