ప్రముఖ హీరో, మ్యూజిక్ డైరెక్టర్‌కు బిగుస్తున్న ఉచ్చు.. డ్రగ్ కేసులో 20వ తేదీ తర్వాతే అరెస్టులు?

హైదరాబాద్ ప్రతిష్ఠకు మచ్చగా మారుతున్న డ్రగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పావులు కదుపుతున్నది. ఈ డ్రగ్ మాఫియాతో టాలీవుడ్ హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఎక్సై

By Rajababu

హైదరాబాద్ ప్రతిష్ఠకు మచ్చగా మారుతున్న డ్రగ్ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా పావులు కదుపుతున్నది. ఈ డ్రగ్ మాఫియాతో టాలీవుడ్ హీరోలకు, దర్శకులకు, నిర్మాతలకు సంబంధాలున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ శాఖ కఠిన చర్యలకు సిద్ధమవుతున్నది. డ్రగ్ సప్లయర్ కెల్విన్ అరెస్ట్ నేపథ్యంలో అధికారులు దర్యాప్తును వేగవంతం చేశారు. కెల్విన్ ఫోన్ డేటా, వాట్సప్ తదితర అంశాల ఆధారంగా ముందుకెళ్తున్నారు. ఈ దర్యాప్తును నీరుగారుస్తున్నారనే విమర్శలు వస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీతో అధికారులు అప్రమత్తమయ్యారు.

అధికారుల దృష్టికి కళ్లు చెదిరే వాస్తవాలు

అధికారుల దృష్టికి కళ్లు చెదిరే వాస్తవాలు

తాజా విచారణ సందర్భంగా కెల్విన్ వెల్లడించిన విషయాలు అధికారులకు కళ్లు చెదురుతున్నట్టు సమాచారం. టాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడి బ్యాచ్‌ కదలికలపై దృష్టిపెట్టినట్టు తెలుస్తున్నది. కెల్విన్ వెల్లడించిన ప్రకారం.. డ్రగ్ సప్లయర్లతో ఓ ఈవెంట్ మేనేజర్, ఓ ప్రముఖ సంగీత దర్శకుడి సోదరుడు, ఇద్దరు బడా నిర్మాతల పుత్రరత్నాలు, నెల్లూరు జిల్లాకు చెందిన ఓ సినీ ఫైనాన్షియర్‌ పేర్లు వెలుగు చూసినట్టు తెలుస్తున్నది.

Recommended Video

Drugs Scandal : Actor Nandu Emotional Convince about his Drug Addicted Issue
సినీ ప్రముఖుల మెడకు ఉచ్చు

సినీ ప్రముఖుల మెడకు ఉచ్చు

డ్రగ్ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖుల మెడకు ఉచ్చు బిగుస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నెల 20వ తేదీన ఓ ప్రముఖ నటుడిని పోలీసులు అదుపులోకి తీసుకొవచ్చనే వార్త బలంగా వినిపిస్తున్నది. అయితే ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి రాకుండా సినీ ప్రముఖుల పేర్లను గోప్యంగా ఉంచుతున్నట్టు పలువురు అధికారులు పేర్కొంటున్నారు.

తెరపైకి మ్యూజిక్ డైరెక్టర్ పేరు

తెరపైకి మ్యూజిక్ డైరెక్టర్ పేరు

గోవా, ముంబై తదితర నగరాల నుంచి మ్యూజిక్ ట్రూప్‌లను తీసుకొచ్చి పాశ్చాత్య సంస్కృతి తగినట్టు కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ఓ సంగీత దర్శకుడి పేరు కూడా తాజాగా తెరపైకి వచ్చింది. పలు సందర్భాల్లో కెల్విన్ నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసినట్టు పోలీసులకు ఆధారాలు దొరికినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో మ్యూజిక్ డైరెక్టర్‌ను కూడా అదుపులోకి తీసుకొనే అవకాశముందనే ఊహాగానాలు వెలువడుతున్నాయి.

సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధం

సినీ, రాజకీయ ప్రముఖులకు సంబంధం

డ్రగ్స్ మాఫియాకు సంబంధమున్న వారిలో ఇప్పటివరకు 25 మంది సినీ ప్రముఖులు, మరో 25 మంది రాజకీయ, వ్యాపారవర్గాల ప్రముఖులు ఉన్నట్టు లెక్క తేలినట్టు తెలుస్తున్నది. ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై సీరియస్‌గా ఉండటం వల్ల ఈ దర్యాప్తు నిజాయితీగా సాగుతుందనే వాదన అధికారులు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే 12 మందికి నోటీసులు

ఇప్పటికే 12 మందికి నోటీసులు

డ్రగ్ కేసుకు సంబంధించి ఇప్పటికే 12 మంది సినీ ప్రముఖులకు నోటీసులు ఇచ్చారు. మరో ఆరుగురికి ఉన్న సంబంధాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో డ్రగ్స్‌ కేసులో భారీ కుదుపులే చోటుచేసుకోనున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. డగ్ర్స్‌ కేసులో కెల్విన్‌ అరెస్టే అత్యంత కీలక పరిణామంగా అధికారులు భావిస్తున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X