అప్పుడు రకుల్ ప్రీత్ సింగ్.. ఇప్పుడు అమన్ ప్రీత్ సింగ్.. డ్రగ్స్ కేసులో సంచలనాలు

హైదరాబాద్‌లో డ్రగ్స్ కేసులో సినీ నటుడు, రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ దీప్ సింగ్ అరెస్ట్‌తో సినీ పరిశ్రమ ఉలిక్కి పడింది. గత కొద్దికాలంగా హైదరాబాద్‌ను డ్రగ్ రహిత నగరం చేయాలనే ఉద్దేశంతో సీఎం రేవంత్ రెడ్డి కఠిన చర్యలు చేపట్టారు. సినీ పరిశ్రమలోని ప్రముఖుల చేత డ్రగ్స్‌ వినయోగానికి దూరంగా ఉండాలంటూ అవగాహన కల్పించే కార్యక్రమాన్ని చేపట్టారు. అయితే ఇలాంటి చర్యల మధ్య అమన్ దీప్ సింగ్ అరెస్ట్ కావడం చర్చనీయాంశమైంది. ఈ కేసు వివరాల్లోకి వెళితే..

పోలీస్ కమిషనర్ తెలిపిన ప్రకారం.. నైజిరియాకు చెందిన వ్యక్తి డ్రగ్ రాకెట్ నడుపుతున్నారు. 20 సార్లు హైదరాబాద్‌కు డ్రగ్స్ తీసుకొచ్చారు. నకిలీ పాస్ పార్టుతో ఓ మహిళ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీరంతా దూల్ పేటలో నివాసం ఉంటున్నారు. తరుచు ఇతర దేశాలకు ప్రయాణం చేస్తుండటంతో అనుమానం వచ్చింది. నలుగురు నైజీరియన్లు పరారీలో ఉన్నారు.

Drug Case Now Aman Preet Singh Then Rakul Preet Singh names surface in Narcotics Case

రాజేంద్ర నగర్ ప్రాంతంలో తనిఖీలు నిర్వహిస్తుండగా డ్రగ్స్ సేవిస్తూ అమన్ దీప్ పట్టుబడ్డారు. అతడిని వినియోగదారుడిగానే పరిగణించాం. అతడిని విచారిస్తున్నాం. అతడిని విచారించిన తర్వాత మేము అతడి నుంచి వివరాలు సేకరించిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తున్నాం. ఆయనను కేవలం వినియోగదారుడిగానే విచారిస్తున్నాం. అతడు సప్లై చేస్తున్నాడా? అనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తాం అని చెప్పారు.

ఇదిలా ఉండగా, గతంలో సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్‌పై కూడా డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. అయితే ఆమెకు నోటీసులు ఇవ్వడంతో ముంబైలోని నార్కోటిక్స్ విభాగ కార్యాలయంలో విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత కూడా ఆమెపై కొన్ని ఇతర ఆరోపణలు వచ్చాయి. కొంతకాలంగా ఆమె హైదరాబాద్‌కు దూరంగా ఉంటున్నారు.

ఇటీవలే రకుల్ ప్రీత్ సింగ్ వివాహం చేసుకొన్నారు. ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీతో అఫైర్ కొనసాగించిన ఆమె వివాహం చేసుకొని కెరీర్‌పై దృష్టిపెట్టారు. అయితే ఇటీవల రకుల్ మామ, భర్త పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోవడంతో జాతీయ మీడియాలో వారి పేర్లు ప్రముఖంగా వినిపించాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X