For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  పూరీ కొంపముంచిన జ్యోతిలక్ష్మి.. అడ్డంగా బుక్కైన జగన్నాథుడు.. అరెస్ట్‌ అంటూ రూమర్లు

  By Rajababu
  |

  డ్రగ్ కేసు విచారణ సందర్భంగా అధికారులు అడిగే ప్రశ్నలకు దర్శకుడు పూరీ జగన్నాథ్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్టు సమాచారం. ఈ కేసుకు సంబంధించిన అడిగిన ప్రశ్నలకు తప్పించేందుకు తప్పుడు విషయాలను వెల్లడించిన పూరీకి అధికారులు షాక్ ఇచ్చారు. అయితే అధికారులు తగిన ఆధారాలు చూపించడంతో పూరీ జగన్నాథ్‌ కంగుతిన్నట్టు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో టాలీవుడ్ పరిశ్రమ వర్గాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.

  గురువారం జరిగే విచారణకు ఛార్మీ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. పూరీ బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు ట్రాన్స్‌ఫర్ అయ్యాయన్న విషయం సంచలనం రేపుతున్నది. బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో మొదలైన విచారణ రాత్రి 8.30 గంటల వరకు సాగింది. తదుపరి విచారణ ఉంటుందా లేదా అనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. పోలీసుల విచారణ ముగిసిన తర్వాత పూరీ ఎక్సైజ్ కార్యాలయం నుంచి కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లారు. దాంతో ఆయన సన్నిహితులు ఊపిరి పీల్చుకొన్నారు.

  నార్కోటిక్ పరీక్షలు నిర్వహించనున్న అధికారులు

  నార్కోటిక్ పరీక్షలు నిర్వహించనున్న అధికారులు

  పూరీ జగన్నాథ్ డ్రగ్స్ వాడుతున్నారా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం నార్కోటిక్ అధికారులను సిట్ ఆఫీసర్లు తమ కార్యాలయానికి పిలిపించినట్టు తెలిసింది. వారు పూరీ రక్తం నమూనాలను సేకరించి డ్రగ్స్ వాడినట్టు నిర్ధారించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. విచారణ నేపథ్యంలో ఎక్సైజ్‌ కార్యాలయం వద్ద బయట నుంచి ఎవరూ లోపలికి రాకుండా మూడంచెల భద్రతను ఏర్పాటుచేశారు.

  Puri Jagannadh Irritated With Enquiry Questions
  పూరీపై ప్రశ్నల వర్షం కురిపించిన సిట్

  పూరీపై ప్రశ్నల వర్షం కురిపించిన సిట్

  బుధవారం ఉదయం 10.30గంటలకు నాంపల్లిలోని ఎక్సైజ్‌ కార్యాలయంలోని ఐదో అంతస్తులో అధికారులు విచారణ చేపట్టారు. పూరీ జగన్నాథ్‌కు డ్రగ్స్‌ ముఠాలతో సంబంధమేమిటి? ఆయనకు డ్రగ్స్‌ వాడటం ఎలా అలవాటైంది? కెల్విన్‌ ఎలా పరిచయం, ఇతర ముఠాలతో ఏమైనా సంబంధాలు ఉన్నాయా? అలాగే చిత్ర పరిశ్రమలో ఇంకెవరికైనా మత్తు మందును సరఫరా చేస్తున్నారా? తదితర ప్రశ్నల వర్షం కురిపించి ఆయన నుంచి సమాధానాలు రాబట్టినట్టు సమాచారం.

  ఎక్సైజ్ ఆఫీస్‌కు చేరుకొన్న వైద్యులు

  ఎక్సైజ్ ఆఫీస్‌కు చేరుకొన్న వైద్యులు

  గత ఎనిమిది గంటల నుంచి జరుగుతున్న విచారణలో ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ అకున్‌ సబర్వాల్‌, ఎక్సైజ్‌ శాఖ కమిషనర్‌ చంద్రవదన్‌ కూడా పూరీతో సమావేశమైనట్టు సమాచారం. ఉదయం నుంచి జరిగిన విచారణకు సంబంధించిన సమాచారంపై వీరు ఆరా తీస్తున్నట్టు తెలుస్తున్నది.

  ఎనిమిది గంటలుగా విచారణ

  ఎనిమిది గంటలుగా విచారణ

  డ్రగ్స్ కేసులో సిట్ అధికారులు విచారించిన అనంతరం పూరీ నుంచి ఆసక్తికరమైన విషయాలను తెలుసుకొన్నారు. కెల్విన్ నుంచి డ్రగ్స్ తీసుకొన్న తర్వాత పూరీ తన తోటి నటులు ఛార్మీ, సుబ్బరాజు, రవితేజ, ఇతర నటులకు సరఫరా చేసేవారని అధికారులు తెలుసుకొన్నట్టు సమాచారం.

  రక్త నమూనాలు సేకరించే అవకాశం

  రక్త నమూనాలు సేకరించే అవకాశం

  నాంప‌ల్లిలోని ఆబ్కారీ శాఖ కార్యాల‌యానికి ఉస్మానియా ఆస్ప‌త్రి వైద్య బృందం చేరుకుంది. ర‌క్త న‌మూనాలు సేక‌రించేందుకు అవ‌స‌ర‌మైన కిట్ల‌ను వెంట తీసుకొని నార్కోటిక్ అధికారుల బృందం వ‌చ్చింది. తాజా ప‌రిస్థితిపై అకున్ స‌బ‌ర్వాల్‌ను అడిగి తెలుసుకుంటున్న‌ట్టు స‌మాచారం. అయితే విచారణ జరుగుతున్నప్పుడు పూరీ అరెస్ట్ జరిగే అవకాశం ఉందనే రూమర్లు విస్తృతంగా ప్రచారం అయ్యాయి. అయితే పూరీని అరెస్ట్ చేయకపోవచ్చనే విషయంపై స్పష్టత వచ్చింది

  పూరీ అరెస్ట్ తప్పదా?

  పూరీ అరెస్ట్ తప్పదా?

  డ్రగ్ కేసులో బుధవారంతో పూరీ జగన్నాథ్ విచారణ ముగుస్తుందా లేక గురువారం కూడా ఆయనను ప్రశ్నిస్తారా అనే విషయంపై స్పష్టత లేదు. ఒకవేళ గురువారం కూడా విచారిస్తే అరెస్ట్ తప్పకపోవచ్చనే అంశం మీడియాలో ప్రచారం జరుగుతున్నది. ఒకవేళ పూరీ అరెస్ట్ జరిగితే ఇతర నటులు కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.

  English summary
  Investigation of Drug links with Tollywood is moving with fast manner. Officials are interogating the Drug supplier Kelvin in their custody. Reports suggest that Kelvin has told many interesting and shocking things to officials. Puri Jagannadh, Raviteja, Charmi, Mumaith Khan, Navadeep are going to attend before SIT from 19th July. In this connection, Police may arrest few tollywood celebrities soon.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X