డ్రగ్స్ కేసులో పట్టుబడ్డ హీరో, మోడల్స్...
కొచ్చి: రంగుల సినిమా ప్రపంచంలోని స్టార్స్...తరచూ అసాంఘీక కార్యకలాపాలైన వ్యభిచారం, డ్రగ్స్ లాంటి కేసుల్లో పట్టుబడుతున్న సంగతి తెలిసిందే. ఇలాంటి కేసుల్లో ఇప్పటికే పలువురు నటులు, నటీమణులను పోలీసులు అరెస్టు చేసినా మళ్లీ మళ్లీ ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. గతంలో తెలుగు స్టార్ హీరో రవితేజ సోదరులతో పాటు మరికొందరు డ్రగ్స్ కేసులో అరెస్టయిన సంగతి తెలిసిందే.
తాజాగా మళయాల చిత్ర నటుడు షినే టామ్ చాకో డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. వీరి వద్ద 10 గ్రాముల కొకైన్ డ్రగ్ లభించింది. అతనితో పాటు మరో నలుగురు మహిళల(మోడల్స్)ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద స్వాధీనం చేసుకున్న కొకైన్ విలువ అంతర్జాతీయ మార్కెట్లో లక్షల్లో ఉంటుందని పోలీసులు తెలిపారు.

డ్రగ్స్ విషయమై పక్కా సమాచారం అందుకున్న పోలీసులు పథకం ప్రకారం దాడి చేసారు. నటుడు షినే టామ్ చాకోతో పాటు మరికొందరు ఓ వ్యాపారి ఇంట్లో డ్రగ్స్ సేవిస్తూ పట్టుబడ్డారు. షినే టామ్ చాకో పట్టుబడటం మళయాల సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అయింది.
చాకో కొంది స్థాయి ఒక్కో మెట్టు ఎక్కుతూ వచ్చిన నటుడు. అసిస్టెంట్ డైరెక్టర్ గా తన కెరీర్ ప్రారంభించి చిన్న చిన్న పాత్రల్లో నటిస్తూ నటుడిగా ఎదిగాడు. ఇతిహాస చిత్రంలో ముఖ్య పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ గ్రాఫ్ బాగా సాగుతుండగా ఇలాంటి నీచమైన, తప్పుడు వ్యవహారాల్లో చాకో పట్టుబడటం అతని కెరీర్ పై ప్రబావం చూపే అవకాశం ఉందని అంటున్నారు.


Click it and Unblock the Notifications