twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఎవరు మారుతున్నారు? టార్గెట్ చేయొద్దు: డ్రగ్స్ ఇష్యూపై దిల్ రాజు

    డ్రగ్స్ కేసు గురించి తనకే ఏమీ తెలియదన్నారు దిల్ రాజు. మీడియా ద్వారానే ఈ విషయాలు తెలుస్తున్నాయన్నారు.

    By Bojja Kumar
    |

    హైదరాబాద్: టాలీవుడ్ డ్రగ్స్ వ్యవహారంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు తనదైన వాదన వినిపించారు. ఇటీవల 'ఫిదా' మూవీ సక్సెస్ మీట్లో పాల్గొన్న దిల్ రాజును డ్రగ్స్ వ్యవహారంపై ప్రశ్నించగా ఆవేశంగా స్పందించారు.

    డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మీడియాకు ఎంత తెలుసో? నాకూ అంతే తెలుసని దిల్ రాజు అన్నారు. ఫిల్మ్ ఇండస్ట్రీ అనేది సెలబ్రిటీలు ఉండేది. సెలబ్రిటీలకు ఏదైనా జరుగగానే ఉత్సాహంగా చూపించేది మీడియా మిత్రులే. మీడియా కంటే ఎక్కువ మాకేమీ తెలియదు. ఏం జరుగుతుందనే ఇన్ఫర్మేషన్ ఎక్కువగా మీడియా దగ్గరే ఉంది అన్నారు.

    ఇండస్ట్రీ మొత్తాన్ని టార్గెట్ చేయొద్దు

    ఇండస్ట్రీ మొత్తాన్ని టార్గెట్ చేయొద్దు

    ఇండస్ట్రీ అంటే పదివేల మంది వరకు ఉంటారు. ఇందులో డ్రగ్స్ వాడేవారు ఐదుగురో, పది మందో ఉండి ఉంటారు. ఎంత పర్సంటేజ్ అది? ఇలాంటివి అన్ని రంగాల్లో ఉన్నాయి. సినిమా అనేది గ్లామర్, గ్లామర్ కాబట్టి అన్ని రకాలుగా ఉంటాయి. ఐదుగురో, పదిమందో ఉంటే మొత్తం ఇండస్ట్రీ ఉన్నట్లు కాదన్నారు.

    Recommended Video

    Puri Jagannath daughter reacted over Drugs Rumor on Her Father
    మంచి సినిమాలు తీస్తే మారుతున్నారా?

    మంచి సినిమాలు తీస్తే మారుతున్నారా?

    చిన్నసినిమాలు, మంచి సినిమాలు తీసిన ప్రొడ్యూసర్ దిల్ రాజు అని మీరే అంటున్నారు. మరి నేను సినిమాల్లో చెప్పింది ఎందుకు నేర్చుకోవడం లేదు జనాలు? మంచి నేర్చుకోరు... చెడుకు అట్రాక్ట్ అవుతారంటే ఎలా? అని దిల్ రాజు ప్రశ్నించారు.

    సోషల్ మీడియా కంటేనా?

    సోషల్ మీడియా కంటేనా?

    ఈ రోజు ఏదైనా ప్రమాదకరంగా ఉంది అంటే అది సోషల్ మీడియానే. సోషల్ మీడియాలో అట్రాక్ట్ అవ్వడం లేదా? సినిమా కంటే ఎక్కువ ఇంపాక్ట్ చేసేది సోషల్ మీడియా. ప్రతి ఒక్కరి చేతిలో సెల్ ఫోన్ ఉంది. దాంతో ఏమైనా చేయగలుగుతున్నారు. ఒక మనిషి చెడిపోవాలన్నా, బాగుపడాలన్నా సినిమా ద్వారా జరుగదు. అది అర్థం చేసుకోవాలి అని దిల్ రాజు సూచించారు.

    ఎన్ని మంచి సినిమాలు వచ్చినా

    ఎన్ని మంచి సినిమాలు వచ్చినా

    ఎన్ని మంచి సినిమాలు వచ్చినా కుటుంబాలు ఎందుకు బాగు పడటం లేదు. శతమానం భవతి తీశాం పేరెంట్స్ ను ఇలా చూడాలని... చూస్తున్నామా? ఎవరి జీవితాలు వాళ్లవి. సినిమా అనేది మీకు ఎంటర్టెన్మెంట్.. ఎమోషన్, అంతకు మించి మరేమీ కాదు. దయచేసి సినిమా వల్ల పాడువుతున్నారని మాత్రం ఎప్పుడూ చెప్పకండి... అని దిల్ రాజు కోరారు.

    సోషల్ మీడియాలో జరిగేది చూస్తే ఏడుపొస్తుంది

    సోషల్ మీడియాలో జరిగేది చూస్తే ఏడుపొస్తుంది

    అప్పుడప్పుడు సోషల్ మీడియా చూస్తుంటే ఏడుపొస్తుంది. అక్కడ జరిగే కొన్ని విషయాలు ఎంత దారుణంగా ఉన్నాయో మీకు తెలిసిందే. ఎవరైనా పర్సన్ వ్యక్తిగతంగా చేసింది సినిమాపై రుద్దడం కరెక్ట్ కాదు. డ్రగ్స్ కేసులో ఆరోపణలు నిజాలా? అబద్దాలా? అని తెలుసుకోవడానికి మేము కూడా వెయిట్ చేస్తున్నాం.

    English summary
    Producer Dil Raju Mind Blowing Answer To Media Question About Drug Scandal.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X