డ్రగ్స్ కేసు : నాంపల్లి కోర్టుకు నటుడు అభిషేక్

By Bojja Kumar

హైదరాబాద్: సినీ నటుడు అభిషేక్ గత సోమవారం మాదక ద్రవ్యాలు(డ్రగ్స్) తరలిస్తూ పోలీసులకు రెడ్ హాండెడ్ గా పట్టు బడ్డ విషయం తెలిసిందే. పోలీసులు అతన్ని రెండు రోజులు కస్టడీలోకి తీసుకున్న అనంతరం ఈ రోజు(డిసెంబర్ 17) నాంపల్లి కోర్టులో హాజరు పరిచారు. విచారణలో అభిషేక్ నుంచి డ్రగ్స్ కేసుకు గురించి కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది.

అభిషేక్ డ్రగ్స్ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నాడనే విషయాలతో పాటు...హైదరాబాద్‌లో ఎవరెవరికి వాటిని సరఫరా చేస్తున్నాడు? అభిషేక్ కష్టమర్లలో సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు గానీ, వారి పుత్రరత్నాలు గానీ ఎవరైనా ఉన్నారా? అనే విషయాలను అభిషేక్ నుంచి పోలీసులు రాబట్టినట్లు చర్చించుకుంటున్నారు.

పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం..అభిషేక్‌కు గోవాలో హోటల్ ఉంది. అక్కడ డ్రగ్స్ ముఠాలతో పరిచయం ఏర్పరుచుకుని అక్కడి నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకొస్తున్నాడు. వాటిని హైదరాబాద్ లోని పబ్‌లకు, సినీ ప్రముఖులకు సరఫరా చేస్తున్నాడు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు అతను డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు పలువురికి డ్రగ్స్ రుచి చూపించి వాళ్లు తన వద్ద రెగ్యులర్‌గా డ్రగ్స్ కొనేలా చేసుకుంటున్నాడు.

అభిషేక్ 'డేంజర్' చిత్రంతో పాటు, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంలో త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించే విలన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రంతో పాటు పలు తెలుగు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసాడు. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాక పోవడంతో గోవా వెళ్లి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసాడు. టాలీవుడ్లో చాలా మంది డ్రగ్స్ కోసం వెంపర్లాడుతుండటంతో.... ఇదే అదునుగా డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన అభిషేక్ గోవాలో డ్రగ్స్ కొని వాటిని హైదరాబాద్ తీసుకొస్తున్నాడు. తనకు సినీరంగంలో పరిచయాలు ఉండటంతో ఎవరికీ అనుమానం రాకుండా డ్రగ్స్ బిజినెస్ కానిచ్చేస్తున్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X