»   » డ్రగ్స్ కేసు: నిర్మాత అరెస్ట్, సీనీ స్టార్స్ తనయులెవరు?

డ్రగ్స్ కేసు: నిర్మాత అరెస్ట్, సీనీ స్టార్స్ తనయులెవరు?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పోలీసులు ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులను అరెస్టు చేసినా టాలీవుడ్లో డ్రగ్స్ వాడకం తగ్గడం లేదు. తాజాగా సినీ నిర్మాత, దర్శకుడు సుశాంత్ రెడ్డి డ్రగ్స్ కేసులో పట్టుబడటం చర్చనీయాంశం అయింది. సుశాంత్ రెడ్డితో పాటు, ఈవెంట్ మేనేజర్ రవి, ఐదుగురు నైజీరియన్లను పోలీసులు అరెస్టు చేసి బుధవారం మీడియా ముందు ప్రవేశ పెట్టారు.

జూబ్లీ హిల్స్ లోని ఓ ప్రాంతంలో ఇద్దరు జైజీరియన్ల నుండి నిర్మాత సుశాంత్ రెడ్డి డ్రగ్స్ తీసుకుంటుండగా పోలీసులు రెండ్ హాండెడ్‌గా పట్టుకున్నారు. అయితే తాను అక్కడికి వెళ్లిన సమయంలో మరికొందరు యువకులు పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు. వీరిలో పలువురు సినీ ప్రముఖుల తనయులు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సీసీ కెమెరా పుటేజీ ఆధారంగా వారిని గుర్తిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

పట్టుబడ్డ వారి వద్ద నుండి వద్ద నుండి మొత్తం 80 గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నారు. 1 గ్రాము కొకైన రూ. 4 వేల నుండి 12 వేల వరకు విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఖరీదైన కొకైన్ డ్రగ్ కొనేది ఎక్కువగా జూబ్లీహిల్స్, బంజారా హిల్స్ ప్రాంతానికి చెందిన వారే అని, ముఖ్యంగా సినీ ప్రరిశ్రమకు చెందిన వారు, వారి పిల్లలు డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

 Drugs case: Police eye on Tollywood

టాలీవుడ్లో కొన్ని పార్టీలు డ్రగ్స్ తో ఇస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. కొందరు నటులు, నిర్మాతలు, తమ స్నేహితులకు, సన్నిహితులకు డ్రగ్స్ పార్టీ ఇవ్వాలనుకున్నపుడు ఈవెంట్ మేనేజర్ కు చెప్పేవారు, సదరు మేనేజర్ పార్టీల్లో మద్యంతో పాటు ఆసక్తి ఉన్న వారికి డ్రగ్స్ సరఫరా చేసే వారు.

కొన్నాళ్లుగా టాలీవుడ్లో ఈ పార్టీలు జరుగుతున్నాయి. ఇందుకు వివిధ ప్రాంతాలను వేదికగా చేసుకుంటున్నారు. కొన్ని సందర్బాల్లో ఇల్లలోనే ఈ పార్టీలు జరుగుతున్నాయి. ఈవెంట్ మేనేజర్ ద్వారా నైజీరియన్లు నిర్మాతకు పరిచయం అయినట్లు తెలుస్తోంది. తరచూ డ్రగ్స్ తీసుకుంటుండటంతో వారికి సన్నిహితంగా మారాడు. వీరిని విచారించి ఇంకా ఎవరెవరు డ్రగ్స్ తీసుకుంటున్నారనే విషయమై పోలీసులు ఆరా తీస్తున్నారు.

English summary
Drugs continue to haunt Telugu film industry. A special police team tracking drug peddlers in Hyderabad city.
Please Wait while comments are loading...