హైదరాబాద్‌లో డ్రగ్స్ రాకెట్ గుట్టురట్టు.. యువ హీరోల పేర్లు, ఫోటోలు తెరపైకి!

బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో డ్రగ్స్ వినియోగం సంఘటన సంచలనం రేపిన విషయం తెలిసిందే. ఈ రేవ్ పార్టీపై బెంగళూరు సెంట్రల్ పోలీసులు మెరుపుదాడి చేసి 100 మందికిపైగా అదుపులోకి తీసుకొన్న సంగతి తెలిసిందే. అందులో సినీ నటి హేమ కూడా అరెస్ట్ కావడం మరింత సంచలనం రేపింది. ఈ ఘటన మరిచిపోకముందే హైదరాబాద్‌లో ఓ డ్రగ్స్ సప్లైదారుడిని అరెస్ట్ చేయడం సినీ వర్గాల్లో కలకలం రేపుతున్నది. ఈ అరెస్ట్ వివరాల్లోకి వెళితే..

హైదరాబాద్‌లోని పబ్‌లో డీజేగా పనిచేస్తున్న సిద్దీ బాయ్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. ముందస్తు సమాచారం అందుకొన్న పోలీసులు ఈ వారు నిర్వహిస్తున్న పార్టీ ప్రదేశంపై మెరుపు దాడి చేశారు. సంఘటనా స్థలం నుంచి సిడ్డీ బాయ్‌ను అదుపులోకి తీసుకొన్నారు అని మీడియాలో వస్తున్న కథనం.

Drugs Rocket Busted in Tollywood by Hyderabad Police

అయితే సిడ్డీ బాయ్‌ను అరెస్ట్ చేసి విచారిస్తున్నట్టు తెలిసింది. ఈ డీజేకు తెలుగు సినిమా పరిశ్రమలోని కొందరు యువ హీరోలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం ప్రస్తుతం వైరల్ అవుతున్నది. ఒకవేళ సిడ్డీ బాయ్ వెల్లడించే సమాచారం ఏదైనా లీక్‌లు, ఎవరి పేర్లైనా వెల్లడిస్తే ఈ కేసు సంచలనం రేపడానికి అవకాశం ఉందని అభిప్రాయపడుతున్నారు.

అయితే సిడ్డీ బాయ్‌తో కొందరు యువ హీరోల ఫోటోలు దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే డ్రగ్స్ పార్టీలతో వారికి సంబంధం ఉందా? లేదా అనేది పక్కన పెడితే.. సిడ్డీ బాయ్ విచారణ ఏం చెబుతాడా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఇక బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో సినీ నటి హేమ ఇటీవలే బెయిల్‌పై రిలీజ్ అయ్యారు. ఆమెకు షరతులతో కూడిన బెయిల్‌కు ఎన్డీపీఎస్ స్పెషల్ కోర్టు అనుమతించింది. ఆమెకు పలు కండీషన్లు పెట్టి బెయిల్ ఇవ్వడం గమనార్హం.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X