సినీ ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న అభిషేక్
హైదరాబాద్: తెలుగు సినీ నటుడు అభిషేక్ డ్రగ్స్‌తో పోలీసులకు రెడ్ హాండెడ్‌గా పట్టుబడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ రోజు పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. వెస్ట్ జోన్ డీసీపీ సుధీర్ బాబు ఈ కేసు విషయమై మాట్లాడుతూ.... అభిషేక్ డ్రగ్స్ దందా నడుతున్నాడని తెలిపారు.
అభిషేక్‌కు గోవాలో హోటల్ ఉందని, అక్కడ డ్రగ్స్ ముఠాలతో పరిచయం ఏర్పరుచుకుని అక్కడి నుంచి డ్రగ్స్ ను హైదరాబాద్ కు తీసుకొస్తున్నాడని. వాటిని హైదరాబాద్ లోని పబ్‌లకు, సినీ ప్రముఖులకు సరఫరా చేస్తున్నాడని వెల్లడించారు. తన వ్యాపారాన్ని పెంచుకునేందుకు అతను డ్రగ్స్ పార్టీలను ఏర్పాటు చేస్తున్నాడని చెప్పుకొచ్చారు.
అభిషేక్ 'డేంజర్' చిత్రంతో పాటు, 'నువ్వొస్తానంటే నేనొద్దంటానా' చిత్రంలో త్రిషను బలవంతంగా పెళ్లి చేసుకునేందుకు ప్రయత్నించే విలన్ పాత్రలో నటించాడు. ఈ చిత్రంతో పాటు పలు తెలుగు చిత్రాల్లో సైడ్ క్యారెక్టర్లు చేసాడు. సినిమాల్లో పెద్దగా అవకాశాలు రాక పోవడంతో గోవా వెళ్లి హోటల్ బిజినెస్ స్టార్ట్ చేసాడు. టాలీవుడ్లో చాలా మంది డ్రగ్స్ కోసం వెంపర్లాడుతుండటంతో.... ఇదే అదునుగా డ్రగ్స్ బిజినెస్ స్టార్ట్ చేసిన అభిషేక్ గోవాలో డ్రగ్స్ కొని వాటిని హైదరాబాద్ తీసుకొస్తున్నాడు. తనకు సినీరంగంలో పరిచయాలు ఉండటంతో ఎవరికీ అనుమానం రాకుండా పని కానిచ్చేస్తున్నాడు.
హైదరాబాద్‌లో డ్రగ్స్ మూలాల్ని పూర్తిగా తొలగించేందుకు పోలీసు శాఖ కృష్ణి చేస్తోందని... సిఐడి ఉన్నతాధికారి కృష్ణ ప్రసాద్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ వెల్లడించారు. ఇంతలోనే అభిషేక్ పట్టుబడటం చూస్తుంటే పోలీసులు సీరియస్ గా డ్రగ్స్ దందాపై దృష్టి సారించినట్లు స్పష్టం అవుతోంది.


Click it and Unblock the Notifications












