twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మద్యం మత్తులో కారుని ఢీ కొట్టిన ప్రముఖ డైరెక్టర్.. క్షణాల్లో మాయం, హీరో బర్త్ డే పార్టీ నుంచి వస్తూ!

    |

    Recommended Video

    Director Bobby Car Rams On To Another Car

    టాలీవుడ్ యువ దర్శకుడు బాబీ (కె ఎస్ రవీంద్ర) మద్యం మత్తులో తన కారుతో మరో కారుని ఢీ కొట్టిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాబీ ప్రతిభావంతుడైన యువ దర్శకుడిగా టాలీవుడ్ లో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. కెరీర్ పరంగా ఇప్పుడిప్పుడే బాబీ ఎదుగుతున్నాడు. తన కారుని ఢీ కొట్టి బాబీ పరారయ్యాడని బాధితుడు సోషల్ మీడియా ద్వారా ఆరోపించాడు. జూబ్లీ హిల్స్ రోడ్ నెం 33 లో ఈ ఘటన చోటు చేసుకుంది.

    ప్రతిభ గల దర్శకుడు

    ప్రతిభ గల దర్శకుడు

    బాబీ రచయితగా ప్రతిభ గల దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. దర్శకుడిగా తన తొలి చిత్రం పవర్ తో విజయాన్ని అందుకున్నాడు. ఆ తరువాత వరుసగా స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ తన స్థాయిని పెంచుకుంటుండడం విశేషం.

    జై లవకుశ చిత్రంతో

    జై లవకుశ చిత్రంతో

    బాబీ ఇప్పటి వరకు రవితేజ, పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో సినిమాలు చేశాడు. గత ఏడాది ఎన్టీఆర్ తో చేసిన జై లవకుశ చిత్రం మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. కమర్షియల్ చిత్రాల దర్శకుడిగా బాబీ స్థాయి పెరుగుతోంది.

    మద్యం మత్తులో

    మద్యం మత్తులో

    ఆదివారం రోజు దర్శకుడు బాబీ తన కారుని ఢీ కొట్టాడని ఓ బాధితుడు సోషల్ మీడియాలో తెలియజేసాడు. దర్శకుడిపై కేసు కూడా నమోదు చేసినట్లు బాధితుడు హర్మీందర్ సింగ్ తెలిపాడు. ఆ సమయంలో బాబీ మద్యం సేవించి వాహనాన్ని నడుపుతున్నాడని ఆరోపించాడు.

    ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల నుంచి

    ఓ ఫ్యామిలీ ఫంక్షన్ నుంచి తిరిగి తన కుటుంబ సభ్యలతో వస్తుండగా రోడ్ నెం 33 వద్ద ఎరుపు రంగు వోల్వో కారు వెనుక నుంచి మా కారుని గుద్దింది. దర్శకుడు బాబీ ఆ కారులో ఉన్నాడు. ఎన్టీఆర్ పుట్టిన రోజు వేడుకలకు హాజరై అతడు తిరిగి వస్తున్నాడని, మద్యం సేవించి వాహనాన్ని నడిపాడని ఆరోపిస్తున్నాడు.

     క్షణాల్లో పారిపోయాడు

    క్షణాల్లో పారిపోయాడు

    తన నివాసం ఇక్కడ ఉంది వెళ్లి మాట్లాడుకుందాం అని చెప్పిన బాబీ క్షణాల్లో పరారయ్యాడని బాధితుడు వాపోతున్నాడు. కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని తెలిపాడు.

    English summary
    Drunk and drive allegation On Director Bobby. FB post goes viral
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X