హీరో కారును ఢీకొట్టిన తాగుబోతు లేడీ
హైదరాబాద్: టాలీవుడ్ యంగ్ హీరోగా ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న సందీప్ కిషన్‌కి ఇటీవల హైదరాబాద్‌లో అనుకోని సంఘటన ఎదురైంది. బాగా మద్యం సేవించిన ఓ లేడీ తన కారును అతివేగంగా నడుపుకుంటూ వచ్చి సందీప్ కిషన్ కారును ఢీ కొట్టింది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదు.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో బుధవారం రాత్రి ఈ సంఘటన చోటు చేసుకుంది. ఈ సంఘటన గురించి సందీప్ కిషన్ తన ట్విట్టర్లో పేర్కొంటూ 'నేను ఇంటికి తిరిగి వెలుతున్నాను. బాగా మద్యం సేవించిన ఓ మహిళ నా కారును అతివేగంగా వచ్చి ఢీ కొట్టింది. నా కారు బాగా డ్యామేజ్ అయింది. అయితే దేవుడి దయ వల్ల ఎవరికీ ఎమీ కాలేదు. ఆ సమయంలో నేను కారులో లేను. రోడ్డు పక్కనే ఓ ఫ్యామిలీ బైక్‌పై ఉంది' అని తెలిపారు.
'మనం డ్రైవింగ్ చేసేప్పుడు మన సేఫ్టీ మాత్రమే కాదు... ఇతరుల సేఫ్టీ గురించి కూడా ఆలోచించాలి' అని సందీప్ కొషన్ ట్వీట్ చేసారు. సందీప్ కిషన్ సినిమాల వివరాల్లోకి వెళితే... ప్రస్తుతం అతను 'మహేష్' సినిమాతో పాటు, డికె.బోస్ సినిమాల్లో నటిస్తున్నారు.
'మహేష్' సినిమాకు ఆర్. మదన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్.కె. పిక్చర్స్ సంస్థ ఈచిత్రాన్ని రూపొందిస్తుండగా దర్శకుడు మారుతి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్ర హీరో సందీప్ కిషన్ సరసన డింపుల్ చోపడే కథానాయికగా నటిస్తోంది.
డికె.బోస్ చిత్రంలో సందీప్ కిషన్, నిషా అగర్వాల్ జంటగా నటిస్తున్నారు. ఈ చిత్రంలో సందీప్ కిషన్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. రాండమ్ థాట్స్ బేనర్ పై శేషురెడ్డి, ఆనంద్ రంగా ఈచిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఏఎస్ బోస్ ఈచిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











