»   »  థియేటర్లో పుట్టిన ఆ పాపే...ఇపుడు హీరోయిన్ అయింది! (ఫోటోస్)

థియేటర్లో పుట్టిన ఆ పాపే...ఇపుడు హీరోయిన్ అయింది! (ఫోటోస్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: పుష్యమి ఫిలింమేకర్స్ బ్యానర్ పై శ్రీమతి బెల్లం సుధారెడ్డి సమర్పణలో రామ్ కార్తీక్‌, కాశ్మీర కుల‌క‌ర్ణి హీరో హీరోయిన్లుగా బెల్లం రామకృష్ణారెడ్డి దర్శకత్వంలో కొల్లు శివ‌నాగేంద్ర‌రావు నిర్మించిన చిత్రం 'దృశ్యకావ్యం'. సెన్సార్ స‌హా అన్నీ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 18న విడుద‌ల‌వుతుంది.

ఈ సినిమా హీరోయిన్ కాశ్వీర కులకర్ణి గురించి ఓ ఆసక్తికర విషయం తెలిసింది. మరాఠీకి చెందిన ఆమెను ఆమె తల్లి ఓ థియేటర్‌లో 'నాచ్‌ మయూరి' అనే చిత్రం చూస్తుండగా ప్రసవించిందట. దాంతో తల్లి అప్పడే డిసైడ్ అయిపోయిందట. ఏమని అంటే తన కుమార్తెను నటిగా చేయాలని. కుమార్తె ఎదిగాక నటిగా మార్చేసింది. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం.

ఫోటోలు: కాశ్మీర కుల‌క‌ర్ణి

చిన్నతనంలో తండ్రిని కోల్పోయిన కష్మీరా కులకర్ణి.. ముంబైలో మొదట ఆడిషన్‌కు వెళితే తిరస్కరించారు. ఆ తర్వాత ప్రయత్నిస్తూనే.. గాష్మీర్‌ మహాజనీ అనే సినిమాలో నటించి పేరు తెచ్చుకుంది. అలాంటి నటి.. తొలిసారిగా తెలుగులో 'దృశ్యకావ్యం'లో నటించింది. తెలుగులో నటించడం చాలా ఆనందంగా వుందనీ... మరాఠీ నుంచి తెలుగు పరిశ్రమకు రావడం అదృష్టంగా భావిస్తున్నట్లు కాశ్మీర కులకర్ణి తెలిపారు. మంచి అవకాశాలు వస్తే ఇక్కడే కొనసాగుతానని పేర్కొంటుంది.

సినిమా గురించి దర్శకుడు బెల్లం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ 'అందరికీ నచ్చేలా ప్రతి సీన్ హార్ట్ ట‌చింగ్‌గా ఉంటుంది. హీరో హీరోయిన్ స‌హా సినిమాలో వర్క్ చేసిన యాక్టర్స్, టెక్నిషియన్స్ మనసు పెట్టి ఈ సినిమాకు పనిచేయడంతో సినిమా అందమైన దృశ్యకావ్యంలా రూపొందింది. ప్రాణం కమలాకర్ అందరితో పోటీపడి ఎక్సలెంట్ మ్యూజిక్ అందించారు. ఇది హర్రర్ చిత్రాలకు డిఫరెంట్ గా ఉంటుంది. అలాగే ఈ సినిమాకు మ్యూజిక్ బ్యాక్‌బోన్‌లా నిలిచింద అన్నారు.

రిలీజ్

రిలీజ్


సినిమాను స్వంతంగా 200 పైగా థియేట‌ర్స్‌లో విడుద‌ల చేస్తున్నాను. ఈ సినిమాలో స‌బ్జెక్ట్ మెయిన్ హీరో. సినిమా క‌చ్చితంగా పెద్ద స‌క్సెస్ అవుతుంది అన్నారు.

మధునందన్

మధునందన్


మ‌ధునంద‌న్‌గారు సెకండ్ లీడ్‌లో న‌టించారు.సినిమాకు మంచి మౌత్ టాక్ వ‌చ్చింది. ట్రైలర్, టీజర్ కు మంచి స్పందన వచ్చింది. టైటిల్ హాట్ టాపిక్‌గా మారింది అన్నారు.

జబర్దస్త్ టీం

జబర్దస్త్ టీం


ఎమోషనల్ లవ్ స్టోరీ. ఫస్టాఫ్ లో జబర్ దస్త్ టీం కామెడి, సెకండాఫ్ లో పృథ్వీ, ఆలీ గారి కామెడి ఆడియెన్స్ నవ్విస్తుంది. సినిమాను మార్చి 18న రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, నార్త్ ఇండియాలో విడుదల చేస్తున్నాం. ప్రేక్షకులు ఆశీర్వదిస్తారని నమ్ముతున్నాను అన్నారు.

నటీనటులు

నటీనటులు


అలీ, పృథ్వీ, సత్యం రాజేష్, చమ్మక్ చంద్ర, షాని, జీవా, మేల్ కోటి, సుమన్ శెట్టి తదితరులు ఇతర తారాగణంగా నటించారు.

తెర వెనక

తెర వెనక


ఈ చిత్రానికి ఎడిటర్: వి.నాగిరెడ్డి, కెమెరా: సంతోష్ శానమోని, సంగీతం: ప్రాణం కమలాకర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కొల్లు శివనాగేంద్రరావు, దర్శకత్వం: బెల్లం రామకృష్ణారెడ్డి.

English summary
Drishya Kavyam release date press meet held in Hyderabad. Drushyakavyam release on 18 March.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu