»   » పవన్ మెమొరబుల్.. చిరు, బాలయ్య లక్కీ ఛాన్స్: దేవిశ్రీ

పవన్ మెమొరబుల్.. చిరు, బాలయ్య లక్కీ ఛాన్స్: దేవిశ్రీ

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ప్రసాద్ సంగీతం అందించిన 'సర్దార్ గబ్బర్ సింగ్' రేపు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఆయన అందించిన ఆడియో ఆల్బమ్ ఇప్పటికే సూపర్ హిట్టయింది. ఈ సినిమా గురించి దేవిశ్రీ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్‌తో కలిసి పని చేయడం మరిచిపోలేని అనుభవం. ఆయనతో మరోసారి పనిచేయాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

దీంతో పాటు చిరంజీవి 150వ సినిమాకు, బాలయ్య 100వ సినిమాకు దేవిశ్రీ సంగీతం అందించబోతున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు మెయిన్ పిల్లర్లుగా ఉన్న ఈ ఇద్దరి స్టార్ల సినిమాలకు సంగీతం అందించే అవకాశం రావడాన్ని అదృష్టంగా భావిస్తున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ వెల్లడించారు. ఇంతకు ముందు దేవిశ్రీ చిరంజీవి శంకర్ దాదా ఎంబీబీఎస్, బాలయ్య 'లజెండ్' చిత్రాలకు సంగీతం అందించారు.

 DSP about Pawan Kalyan

దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సినిమా..
సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాను నిర్మించబోతున్నది ప్రముఖ నిర్మాత దిల్ రాజు. మన ఇండస్ట్రీలో ఇప్పటికే మంచి స్టార్స్ ఉన్నారు. హీరోగా నటించి ఏదో చేయాలని కాదు. మ్యూజిక్ షోలు ఇవ్వడం వల్ల ప్రేక్షకుల్లో ఓ ఇమేజ్ ఏర్పడింది. నా బాడీ లాంగ్వేజ్ అందరికీ తెలుసు. నా బాడీ లాంగ్వేజ్ కి తగిన కథతోనే సినిమా చేస్తున్నట్లు దేవిశ్రీ ప్రసాద్ తెలిపారు.

English summary
Stating that working with Pawan Kalyan is a ‘memorable kick’ DSP said that he is looking forward to working with Pawan again. DSP is also the chosen man to compose for two landmark projects, Chiru’s 150th film and Balayya’s 100th film.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu