‘గబ్బర్ సింగ్’ ట్యూన్స్‌కి దేవిశ్రీ, హరీష్ స్టెప్పులు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'గబ్బర్ సింగ్' మూవీ ఆడియో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా...అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అభిమానుల ఆశ కూడా తీరే సమయం దగ్గర పడింది. ఏప్రిల్ 15న ఈ చిత్ర ఆడియో కనివినీ ఎరుగని రీతిలో ఒకే రోజు రాష్ట్రంలోని మూడు ప్రధాన నగరాలు హైదరాబాద్, విశాఖపట్నం, తిరుపతిల్లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మరో వైపు ఈచిత్రానికి సంగీతం సమకూర్చుతున్న దేవిశ్రీ ప్రసాద్ కూడా ఆడియో హిట్టవుతుందని చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. తన ట్విట్టర్లో దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ట్యూన్స్ సూపర్‌గా వచ్చాయని స్పష్టం అవుతోంది. 'యెస్టర్ డే గ్రేడ్ డే, నేను హరీష్ కలిసి గబ్బర్ సింగ్ ఫైనల్ మిక్సింగ్ సాంగ్స్ విన్నాం. ఇద్దరం కలిసి నా స్టూడియోలో డాన్స్ చేశాం. ఆడియో విడుదల కోసం ఆత్రంగా ఎదురు చూస్తున్నాం' అంటూ పేర్కొన్నారు.
గతంలో పవన్ కళ్యాణ్-దేవిశ్రీ కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' మంచి మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈనేపథ్యంలో 'గబ్బర్ సింగ్' చిత్రం కూడా అదే రేంజ్‌లో హిట్టవుతుందని అటు దర్శక నిర్మాతలతో పాటు, ఇటు అభిమానులు కూడా కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు.
పవన్ కళ్యాణ్, శృతి హాసన్ జంటగా రూపొందుతున్న ఈచిత్రానికి ఫోటోగ్రఫీ: జైనన్ విన్సెంట్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఆర్ట్: కడలి బ్రహ్మ, ఎడిటింగ్ గౌతం రాజు, స్ర్కీన్ ప్లే: రమేష్ రెడ్డి, వేగ్నేష్ సతీష్, ప్రొడక్షన్ కంట్రోలర్: డి. బ్రహ్మానందం, సమర్పణ: శివబాబు బండ్ల, నిర్మాత: బండ్ల గణేష్, స్క్రీన్ ప్లే, మాటలు, దర్శకత్వం: హరీష్ శంకర్ ఎస్.


Click it and Unblock the Notifications











