»   » బన్నీ-త్రివిక్రమ్ మూవీ: కొత్త పాప్ సింగర్‌తో దేవిశ్రీ...

బన్నీ-త్రివిక్రమ్ మూవీ: కొత్త పాప్ సింగర్‌తో దేవిశ్రీ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకరైన దేవిశ్రీ ప్రసాద్ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తుంటారు. ఆ మధ్య ‘ఇద్దరమ్మాయిలతో' చిత్రంతో అపాచె ఇండియన్ అనే పాప్ సింగర్ ను టాలీవుడ్‌కి పరిచయం చేసిన దేవిశ్రీ ప్రసాద్....తాజాగా అల్లు అర్జున్ అప్ కమింగ్ మూవీ ‘సన్నాఫ్ సత్యమూర్తి' చిత్రానికి మరో పాప్ సింగర్‌ను పరిచయం చేయబోతున్నారు.

ప్రముఖ ఫోక్, ఫుషన్ సింగర్ రఘు దీక్షిత్‌ను దేవిశ్రీ ప్రసాద్ పరిచయం చేస్తున్నారు. ఇటీవల అతని సాంగ్ రికార్డింగ్ కూడా పూర్తయింది. ఈ విషయాన్ని రఘు దీక్షిత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ‘అల్లు అర్జున్ సినిమా కోసం కంపోజర్ దేవిశ్రీప్రసాద్ తో కలిసి ఓ కికాస్ సాంగ్ రికార్డు చేసాం. అతనితో పని చేయడం చాలా హ్యాపీగా ఉంది' అంటూ ట్వీట్ చేసారు.

DSP introduces pop singer Raghu Dixit

ఫేస్‌బుక్ ద్వారా లేటెస్ట్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు

సినిమాకు సంబంధించిన వివరాల్లోకి వెళితే...
ఈచిత్రంలో సమంత, నిత్యామీనన్, అదాశర్మ హీరోయిన్స్. కన్నడ స్టార్ ఉపేంద్ర, రాజేంద్రప్రసాద్, స్నేహ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇతర పాత్రల్లో సింధుతులాని, వెన్నెల కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, రావ్ రమేష్ నటిస్తున్నారు. జులాయి తర్వాత బన్నీతో చేస్తున్న సినిమా కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి.

వేసవిలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారు. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌ వెడ్డింగ్‌ ప్లానర్‌గా కనిపించనున్నారు. బన్నీ సృష్టించే పెళ్లి సందడి.. వినోదాలు పంచనుంది. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో ఎస్.రాధాకృష్ణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. సాంకేతిక వర్గం ఆర్ట్ - రవీందర్, కెమెరా - ప్రసాద్ మూరెళ్ల, మ్యూజిక్ - దేవిశ్రీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ - పి.డి.ప్రసాద్, నిర్మాత -ఎస్. రాధాకృష్ణ, స్టోరీ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం - త్రివిక్రమ్ శ్రీనివాస్.

English summary
DSP introduces pop singer Raghu Dixit
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu