అతడు కింగ్... అంటున్న రామ్ చరణ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ వంశీ పైడిపల్లి దర్శకత్వంలో చేస్తున్న 'ఎవడు' చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. దేవిశ్రీ తన సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయడంపై రామ్ చరణ్ తెగ హ్యాపీగా ఫీలవుతున్నాడు. అంతే కాదు అతన్ని పొగడ్తలతో ముంచేస్తున్నాడు.
ఈ విషయమై రామ్ చరణ్ తన ట్విట్టర్లో.... ప్రస్తుతం ఎవడు షూటింగ్‌లో ఐటం సాంగు చిత్రీకరణ సాగుతోంది. దేవిశ్రీ సాంగు అద్భుతంగా కంపోజ్ చేశాడు. ఈ పాటతో దేవిశ్రీ రేంజి పెరుగుతుందని ట్వీట్ చేశాడు. దేవిశ్రీకి 'ది కింగ్ ఆఫ్ ఐటెమ్స్' అనే బిరుదు కూడా ఇచ్చేశాడు. మరి రామ్ చరణ్ ఇంతలా ఎగ్జైట్ అవుతున్నాడంటే మరి ఆ సాంగు అదిరి పోయి ఉంటుందని అభిమానులు చర్చించుకుంటున్నారు.
వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈచిత్రంలో రామ్ చరణ్ సరసన సమంత, అమీజాక్సన్ రొమాన్స్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బేనర్‌పై ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ చిత్రంలో రామ్ చరణ్ పాత్ర డిఫెరెంట్ గా ఉండనుంది.
దేవిశ్రీప్రసాద్ బాణీలతో జోరుగా ముస్తాబవుతోన్న ఈ సినిమాకి, వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు. అల్లు అర్జున్ ఇందులో ఓ ప్రత్యేక పాత్రలో కనిపిస్తాడు. ఇక తమన్నాతో కలిసి రామ్‌చరణ్ చేసిన 'రచ్చ' ప్రస్తుతం ప్రేక్షకులను అలరిస్తోంది.


Click it and Unblock the Notifications











