మహేష్ బాబుకు కూడా కెవ్వు కేకే...!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ కోసం 'కెవ్వు కేక' అంటూ కేక పుట్టించే ఎనర్జిటిక్ సాంగును కంపోజ్ చేసిన యువ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్....త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులతో కూడా కెవ్వు కేక లాంటి సాంగును రెడీ చేస్తున్నాడు. మహేష్ బాబు త్వరలో సుకుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
సూపర్ స్టార్‌తో తొలి సినిమా కావడంతో దేవిశ్రీ ప్రసాద్ ట్యూన్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ధ పెట్టాడు. తన కెరీర్లోనే బెస్ట్ మ్యూజిక్ ఇచ్చేందుకు ట్రై చేస్తున్నాడు. ఇంకా పేరు ఖరారు కాని ఈ చిత్రం ఏప్రిల్ 23 నుంచి షూటింగ్ జరుపుకోనుంది. తొలి షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో రూ. కోటిన్నరతో వేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరుపుతారు. తదనంతరం థాయ్‌లాండ్, బ్యాంకాక్‌లో ఓ షెడ్యూల్ చేయనున్నారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తోంది.
మహేష్‌తో 'దూకుడు' చిత్రాన్ని నిర్మించిన 14రీల్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. రొమాంటిక్ చిత్రాల దర్శకుడిగా గుర్తింపుపొందిన సుకుమార్ దర్శకత్వంలో మహేష్‌బాబు తొలిసారిగా నటిస్తుండటంతో ఈ చిత్రం ప్రేక్షకుల్లో ఆసక్తిని క్రియేట్ చేస్తోంది. సుకుమార్ తయారుచేసిన స్క్రిప్ట్ మహేష్‌బాబుని బాగా ఇంప్రెస్ చేసిందని, ముఖ్యంగా ఆయన క్యారెక్టరైజేషన్ పూర్తి వైవిధ్యంగా వుండేలా సబ్జెక్ట్‌ను సుకుమార్ తీర్చిదిద్దాడని చిత్ర వర్గాలు చెబుతున్నాయి.
సుకుమార్ తన వరుస సినిమాలకు దేవిశ్రీ ప్రసాద్‌నే సంగీత దర్శకుడిగా ప్రిపర్ చేస్తున్నాడు. సుకుమార్ దర్శకత్వం వహించిన ఆర్య, ఆర్య2, జగడం, 100% లవ్ చిత్రాలకు దేవిశ్రీనే స్వరాలు సమకూర్చాడు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన చిత్రాలన్నీ ఆడియో పరంగా సూపర్ హిట్ అయ్యాయి. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినిమాకు దేవిశ్రీ అందించే అందించే సంగీతంపై కూడా మంచి అంచనాలున్నాయి.


Click it and Unblock the Notifications











