twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    విడుదలకు ముందే దూకుడులా అంచనాలను పెంచుతున్న‘ఊసరవెల్లి’...!

    By Sindhu
    |

    ఇటీవలి కాలంలో రెండు సినిమాలు టాలీవుడ్ లో అందరి దృష్టినీ విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. అవి... దూకుడు, ఊసరవెల్లి. అందరూ ఎంతగానో ఎదురుచూసిన 'దూకుడు' రిలీజ్ అయిపోవడం... హిట్ అవ్వడం జరిగిపోయాయి. ఇక 'ఊసరవెల్లి' వంతు వుంది. 'దూకుడు' హిట్ అవ్వడంతో 'ఊసరవెల్లి' మీద కూడా ఎక్స్ పెక్టేషన్స్ ఎక్కువయ్యాయి. పైగా, ఇంతకు ముందు వచ్చిన ఎన్టీఆర్ సినిమా 'శక్తి' ఫ్లాప్ అవ్వడంతో ఇప్పుడు ఎన్టీఆర్ కు ఓ హిట్ కచ్చితంగా అవసరం.

    ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్స్ ఈ సినిమాపై అంచనాలు పెంచుతున్నాయి. 'దూకుడు" చిత్రం విడుదలై మాంచి కలెక్షన్స్ తో ముందుకు దూసుకెళుతోంది. ఈ క్రమంలో 'ఊసరవెల్లి" చిత్రం ఎలాంటి రిజల్ట్ తెచ్చుకుంటుందో అనే ఆసక్తి నెలకొంది. కానీ ఈ సినిమాపై నందమూరి అభిమానులు, ఎన్టీఆర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారని, ఖచ్చితంగా ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేస్తుందనే భావాన్ని వ్యక్తపరుస్తున్నట్టు సమాచారం.

    కాగా అక్టోబర్ 6న విజయదశమి సందర్భంగా ఊసరవెల్లి రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన డీటీయస్ వర్క్ జరుగుతోంది. ఇటీవల రిలీజ్ చేసిన ఆడియో మంచి హిట్ అయిందనీ, త్వరలో ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తున్నామనీ నిర్మాత భోగవల్లి ప్రసాద్ చెప్పారు. ఎన్టీఆర్ పక్కన తమన్నా ఇందులో హీరోయిన్ గా నటించింది.

    English summary
    Jr Ntr starrer Oosaravelli is gearing up for its worldwide release on 6th October for Dussera. The makers inform that the film is a romantic action entertainer with Jr Ntr’s characterization as the highlight. Fair beauty Tamanna and Payal Ghosh of Prayanam fame have sizzled alongside Ntr in the film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X