సినీ నిర్మాత కేదార్ డెత్ మిస్టరీ.. కేంద్రం ఆదేశం.. దుబాయ్ పోలీసులు క్లారిటీ ఏమిటంటే?
నిర్మాత కేదార్ సెలగంశెట్టి దుబాయ్‌లో ఆకస్మికంగా మరణించడంపై అనేక అనుమానాలు తలెత్తాయి. ఆయన మరణం వెనుక మిస్టరీ ఉందని రాజకీయ వర్గాలు అనేక అనుమానాలు వ్యక్తం చేశాయి. కేదార్ మృతికి డ్రగ్స్ దందా మాఫియాకు సంబంధం ఉందనే అనుమానాన్ని కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేశారు. ఈ క్రమంలో సీఎం రేవంత్, ఎంపీ చామల, ఎమ్మెల్యే యెన్నంరెడ్డి శ్రీనివాసరెడ్డి తదితరులు ఈ మరణం వెనుక నిజాలను బయటపెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో దుబాయ్ పోలీసులు సంచలన రిపోర్టు ఇచ్చినట్టు తెలిసింది. ఆ వార్త వివరాల్లోకి వెళితే..
నిర్మాత కేదార్ బాబు మృతిపై సెంట్రల్ దర్యాప్తు సంస్థలు విచారణ జరపాలని నేను డిమాండ్ చేస్తున్నాను. ఆయన దుబాయ్‌లో అనుమానాస్పద స్థితిలో మరణించాడు. సినీ నిర్మాత, రియల్డర్, బిజినెస్ మ్యాన్ మాత్రమే కాకుండా బీఆర్ఎస్ పార్టీ నేత. బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆస్తులు భారీగా పెరిగాయి. కేటీఆర్, హరీష్ రావుతో సన్నిహితం ఉన్న ఆయన పెద్ద పారిశ్రామిక వేత్తగా మారారు అని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు.

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ఆరోపించినట్టుగా పెద్ద ఎత్తున్న మనీలాండరింగ్ జరిగింది. అప్పటి ప్రభుత్వంలో ఈయన ద్వారా కూడా మనీలాండరింగ్ జరిగిందనే అనుమానాలు ఉన్నాయి. ఫిబ్రవరి 24వ తేదీన ఆయన అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన సమయంలో కొందరు బీఆర్ఎస్ నేతలు దుబాయ్, అబుదాబీలోనే ఉన్నారు. దాంతో ఇంకా అనుమానాలు ఎక్కువయ్యాయి. కాబట్టి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఈ అంశంపై దర్యాప్తుకు ఆదేశించాలని ఎంపీ చామల కోరారు.
ఇదిలా ఉండగా, సీఎం రేవంత్ రెడ్డి కూడా నిర్మాత కేదార్ బాబు మృతిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అనుబంధంగా ఉన్న నేతలు, అలాగే డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న వారంతా అనుమానాస్పదంగా మరణిస్తున్నారు అని తెలంగాణ సీఎం చేసిన వ్యాఖ్యలు భారీ చర్చకు దారి తీశాయి. దాంతో ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వం లేఖ రాసి.. కేదార్ బాబు మృతి వెనుక కారణాలు తెలపాలని కోరారు.
అయితే భారత ప్రభుత్వం రిక్వెస్ట్ మేరకు కేదార్ సెలగంశెట్టి మృతిపై దుబాయ్ పోలీసులు విచారణ జరిపించారు. అయితే ఆయన మృతి వెనుక ఎలాంటి అనుమానాస్పద అంశాలు లేవు. ఆయనది సహజ మరణమే అని దుబాయ్ పోలీసులు కేంద్ర ప్రభుత్వం లేఖకు జవాబు ఇచ్చినట్టు తెలిసింది.
అయితే నిర్మాత కేదార్ విషయానికి వస్తే.. అల్లు అర్జున్, విజయ్ దేవరకొండ లాంటి అగ్రహీరోలు, దర్శకులు, నిర్మాతలతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. వారికి కోట్ల రూపాయల మేర అడ్వాన్స్‌లు కూడా ఇచ్చారనే విషయం బయటకు వచ్చింది. గతేడాది ఫిబ్రవరి 25 తేదీన హైదరాబాద్ ర్యాడిసన్ హోటల్‌లో నార్కోటిక్ అధికారులు జరిపిన దాడిలో ఆయనపై కేసు బుక్ అయింది. ఆయన పెళ్లి కోసం దుబాయ్‌కి వెళ్లిన ఆయన అనుమానాస్పద పరిస్థితిలో మరణించారు.


Click it and Unblock the Notifications











