»   » కొత్త ట్విస్ట్: శ్రీదేవి ఫోన్ నుండి ఆ నెంబర్‌కు కాల్స్, బోనీ సుదీర్ఘ విచారణ, కాల్ డేటాపై నిఘా

కొత్త ట్విస్ట్: శ్రీదేవి ఫోన్ నుండి ఆ నెంబర్‌కు కాల్స్, బోనీ సుదీర్ఘ విచారణ, కాల్ డేటాపై నిఘా

Posted By:
Subscribe to Filmibeat Telugu

శ్రీదేవి మరణానికి కారణం గుండె పోటు అని తెలిసినా... తర్వాత ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న వార్తలు అభిమానులను మరింత ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆమె బాత్రూంలో నేలపై పడిపోయి ఉన్నారని కొన్ని రిపోర్ట్స్, బాత్ టబ్ లో నీటిలో మునిగిపోయి ఉన్నారని మరికొన్ని రిపోర్ట్స్ వస్తుండటంతో కొత్త అనుమానాలు రేకెత్తుతున్నాయి. టాప్ సెలబ్రిటీ కేసు కావడంతో దుబాయ్ పోలీసులు కూడా ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకున్నారు. ఇంటర్నేషనల్ స్టాండర్ట్స్‌తో దీన్ని డీల్ చేస్తున్నారు.

బోనీ కపూర్‌ను మూడున్నర గంటలు విచారించిన పోలీసులు

బోనీ కపూర్‌ను మూడున్నర గంటలు విచారించిన పోలీసులు

ఈ కేసులో దుబాయ్ పోలీసులు శ్రీదేవి భర్త బోనీ కపూర్‌ను విచారించారు. దాదాపు 3.5 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించారు. అతడి వాంగ్మూలాన్ని రికార్డు చేశారు.

ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి

ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి

దుబాయ్ పోలీసులు బోనీ కపూర్‌ను ప్రశ్నలతో ఉక్కిరి బిక్కిరి చేసినట్లు తెలుస్తోంది. శ్రీదేవి, మీరు వేర్వేరు రూముల్లో ఎందుకు బస చేశారు. శనివారం ఏ సమయానికి ఆమె రూముకు వెళ్లారు.....అనే అంశం నుండి ఆసుపత్రిలో వైద్యులు ఆమె డెత్ నిర్దారించే వరకు జరిగిన పరిణామాలన్నింటినీ రికార్డు చేశారు.

హోటల్ సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

హోటల్ సిబ్బందిని ప్రశ్నించిన పోలీసులు

శ్రీదేవి బస చేసిన హోటల్ సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నించారు. ఆమె రూముకు ఏ సమయంలో ఎవరు వెళ్లారు, చలనం లేకుండా పడిపోయి ఉన్న ఆమెను రూము నుండి ఎవరు బయటకు తీసుకు వచ్చారు అనే అంశాలను సీసీ టీవీ పుటేజీలో పరిశీలించినట్లు తెలుస్తోంది.

ప్రతి విషయం క్షుణ్ణంగా

ప్రతి విషయం క్షుణ్ణంగా

దుబాయ్ పోలీసులు ఏ చిన్న విషయాన్ని కూడా ఈజీగా తీసుకోకుండా ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా, లోతుగా విచారిస్తున్నారు. బోనీ కపూర్ తో పాటు మరికొందరిని కూడా వారు ప్రశ్నించినట్లు తెలుస్తోంది.

డాక్టర్లు, అటెండెంట్స్ వాంగ్మూలం కూడా

డాక్టర్లు, అటెండెంట్స్ వాంగ్మూలం కూడా

శ్రీదేవి మరణాన్ని ధృవీకరించిన ఇద్దరు వైద్యుల స్టేట్మెంటుతో పాటు, ఐదుగురు అటెండన్స్ వాంగ్మూలం కూడా పోలీసులు సేకరించారు. అన్ని ఫార్మాలిటీస్ పూర్తయిన తర్వాతే పోలీసులు శ్రీదేవి భౌతిక కాయాన్ని బంధువులకు అప్పగించారు.

అనేక మలుపులు

అనేక మలుపులు

సినీ నటి శ్రీదేవి మృతి అంశం అనేక మలుపులు తీరుగుతున్నది. ఫొరెన్సిక్ నివేదిక తర్వాత సంచలన విషయాలు బయటకు వస్తున్నాయి. దీంతో శ్రీదేవి మరణం సహజం కాదనే అంశంపై సందేహాలు నెలకొంటున్నాయి.

ఫోరెన్సిక్ నివేదిక

ఫోరెన్సిక్ నివేదిక

ఫోరెన్సిక్ నివేదిక వెల్లడైన తర్వాత దర్యాప్తు మరో మలుపు తిరిగింది. శ్రీదేవి, బోనికపూర్ మొబైల్ కాల్‌డేటాను దుబాయ్ అధికారులు పరిశీలిస్తున్నారు. బోనితోపాటు మరో ముగ్గురు వ్యక్తులను ప్రశ్నించారు.

ఆ నెంబర్ నుండి కాల్స్

ఆ నెంబర్ నుండి కాల్స్

శ్రీదేవి మొబైల్ ఫోన్ నుంచి ఓ ఫోన్ నంబర్‌కు ఎక్కువ కాల్స్ వెళ్లినట్టు దుబాయ్ పోలీసులు గుర్తించారు. శ్రీదేవి మృతిపై ఇంకా దర్యాప్తు కొనసాగుతున్నదని పోలీసులు చెప్పడం అనేక అనుమానాలకు దారి తీస్తున్నది.

English summary
Dubai police have recorded Boney Kapoor's statement in connection with his wife Sridevi's sudden demise, PeepingMoon.com reports. It was Boney who reportedly found Sridevi lying motionless in a bathtub filled with water, although some reports contest this claim.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu