తల పొగరుతో భోజనాన్ని కాలితో తన్నింది, ఫలితం అనుభవించింది.. సీనియర్ నటి జానకి!
Recommended Video
డబ్బింగ్ ఆర్టిస్ట్ గా, నటిగా జానకి వందలాది చిత్రాల్లో నటించింది. సాగర సంగమం, స్వాతి ముత్యం, గీతాంజలి లాంటి ఎన్నో చిత్రాల్లో జానకి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించారు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఆమె నటించిన చిత్రాలు 700కు పైగా ఉంటాయి. తన భర్త మిలటరీ వ్యక్తి అని, తాను కూడా ఎంతోకొంత సంపాదించడానికి సినిమాల్లోకి వచ్చానని జానకి తెలిపారు. జానకి నటించిన తొలి చిత్రం భూ కైలాస్. అలీతో సరదాగా కార్యక్రమంలో ఇటీవల జానకి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జానకి తనకు ఎదురైన చేదు అనుభవాన్ని వివరించారు.

ఔట్ డోర్ షూటింగ్
ఓ చిత్ర షూటింగ్ లో భాగంగా నటీనటులంతా బయట ప్రాంతానికి వెళ్లాం. ప్రస్తుతం నటీనటులకు ఒక్కొక్కరిని ఒక్కో రూమ్ ని నిర్మాతలు కేటాయిస్తున్నారు. అప్పట్లో అలా ఉండేది కాదు. ఇద్దరు ముగ్గురు ఒక రూమ్ షేర్ చేసుకోవాలి. భోజనం కూడా అలాగే క్యారేజిలో పెట్టి గదులకు పంపేవారు. నాతో పాటు బాగా తలపొగరు కలిగిన ఓ ప్రముఖ నటి కూడా అదే గదిలో ఉంది. నాకు త్వరగా తిని పడుకోవడం అలవాటు. ఆ రోజు కూడా భోజనం చేసి పడుకున్నా అని జానకి అన్నారు.

కాలితో తన్నింది
సదరు నటి వచ్చే సమయానికి నేను పడుకుని ఉన్నానని జానకి తెలిపారు. జానకి అప్పడే తినేసి పడకుందా.. అంటే ఆమె తినగా మిగిలినది నేను తినాలా అంటూ కోపంతో భోజనం ఉన్న క్యారేజ్ ని తన్నింది. దీనితో అన్నం గది మొత్తం చెల్లాచెదురుగా పడిందని జానకి తెలిపారు. ఆ నటి ఎవరని అడగా.. పేరు చెప్పనని, ఆమె ప్రస్తుతం ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నారని అన్నారు. ఆమె తలపొగరుకు తగ్గ ఫలితం అనుభవించిందని జానకి తెలిపారు. సదరు నటి పేరు మాత్రం ఆమె చెప్పలేదు. జానకి వ్యాఖ్యలతో అలా ప్రవర్తించిన నటి ఎవరనే చర్చ జరుగుతోంది.

కలర్ తక్కువగా ఉన్నానని
తనకు ఎన్టీఆర్ క్లాసిక్ మూవీ లవకుశ చిత్రంలో నటించే అవకాశం వచ్చిందని జానకి అన్నారు. దర్శకుడు ఆఫీస్ కు పిలిస్తే వెళ్లాను. కీలక పాత్ర ఉందని చెప్పారు. నా ఫోటోలు దర్శకుడుకి ఇచ్చి వచ్చేశాను. కానీ ఆ పాత్రని జయంతి గారికి ఇచ్చేశారని తెలిసింది. తాను కాస్త కలర్ తక్కువగా ఉన్నానని కారణం చెప్పారు. లవకుశ చిత్రం చూసినప్పుడల్లా ఇంత గొప్ప చిత్రంలో అవకాశం కోల్పాయనే అని బాధపడుతుంటానని జానకి అన్నారు.

మిలటరీ వ్యక్తి
తన భర్త మిలటరీలో పనిచేయడం వల్ల బోర్డర్ లో ఉండేవారు. నేను కూడా ఏదోఒక ఉద్యోగం చేయాలని మద్రాసు వచ్చాను. సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన ఇల్లు గడిచేందతా డబ్బు సంపాదిస్తే చాలని అనుకునే దాన్ని. ఎక్కువ డబ్బు సంపాదించాలనే కోరిక తనకు ఉండేది కాదని జానకి అన్నారు. ఇలా జానకి తన గురించి అనేక విషయాల అలీతో సరదాగా కార్యక్రమంలో పంచుకున్నారు.


Click it and Unblock the Notifications











