twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    హాట్ టాపిక్ : బాలకృష్ణకు డబ్బింగ్ పోటు

    By Srikanya
    |

    హైదరాబాద్ : బాలకృష్ణకు తాజాగా డబ్బింగ్ తలనొప్పి ఎదురుకానుంది. బాలకృష్ణ తాజా చిత్రం శ్రీమన్నారాయణ ఈ నెల 30న విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చిత్రం విడుదలైన మరుసటి రోజున అంటే (ఆగస్టు 31)న రెండు డబ్బింగ్ చిత్రాలు విడుదల అవుతున్నాయి. అవి బెల్లంకొండ చిత్రం ఓకె.ఓకే, జీవా చిత్రం మాస్క్. ఈ రెండు చిత్రాలపై ప్రేక్షకులపై మంచి ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి. అయితే శ్రీమన్నారాయణ చిత్రంపై నందమూరి అభిమానులకే కాక బయిట కూడా మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిత్రం ఆడియో కు సైతం మార్కెట్లో మంచి ఊపు వచ్చింది.

    బాలకృష్ణ మాట్లాడుతూ...'' కత్తి కన్నా కలం గొప్పదని చాలా సందర్భాల్లో నిరూపితమైంది. అలాంటి శక్తిమంతమైన పాత్రికేయుడిగా కనిపిస్తాను. నవరసాలు మేళవించిన కథాంశమిది. ప్రజల నాడి తెలిసిన దర్శకుడు రవికుమార్‌ చావలి. ఆయన చిత్రాన్ని తీర్చిదిద్దిన విధానం చాలా బాగుంది. 'సింహా' తర్వాత చక్రి నా సినిమాకి బాణీలందించారు. ఈ చిత్రం కూడా 'సింహా'లా విజయవంతం అవుతుందని నమ్ముతున్నా. బాలకృష్ణ సినిమాల్లోనే మాకు మంచి పాత్రలు దక్కుతుంటాయని నా కథానాయికలు చెబుతుంటారు. ఈ చిత్రంలోనూ ఇషాచావ్లా, పార్వతి మెల్టన్‌లకు మంచి పాత్రలే దక్కాయి. ఎప్పటికప్పుడు వైవిధ్యమైన పాత్రలు పోషిస్తూ అభిమానుల్ని అలరిస్తూనే ఉంటాను'' అన్నారు.

    ఉదయనిధి స్టాలిన్, హన్సిక మొత్వానీ జంటగా మల్టీడైమెన్షన్ సమర్పణలో సాయిగణేష్ ఫిలింస్ పతాకంపై తెలుగులో అందిస్తున్న చిత్రం 'ఓకే.. ఓకే'. ఎం.రాజేష్ దర్శకత్వంలో బెల్లంకొండ సురేష్, బెల్లంకొండ గణేష్‌బాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమిళంలో నిర్మించిన 'ఒరుకల్ ఒరుకన్నాడి' చిత్రాన్ని తెలుగులో 'ఓకే.. ఓకే'గా అనువదిస్తున్నారు. సోనీ మ్యూజిక్స్ ద్వారా ఈ చిత్రంలోని పాటలు ఇప్పటికే విడుదలయ్యాయి.

    ఆర్.బి.చౌదరి సమర్పణలో మెగా సూపర్‌గుడ్ ఫిలింస్ ప్రై. లి. పతాకంపై జీవా కథానాయకుడుగా నిర్మిస్తున్న చిత్రం 'మాస్క్'. మిస్కిన్ దర్శకత్వంలో ఎన్.వి.ప్రసాద్, పారస్ జైన్ ఈ చిత్రాన్ని అందిస్తున్నారు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగస్టు 31న విడుదలకు సిద్ధం అవుతోంది. ఆర్.బి.చౌదరి మాట్లాడుతూ...మాస్క్ చిత్రం మీద ఇప్పటికే మంచి అంచనాలున్నాయి. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఈచిత్రం అలరిస్తుంది. ఈ మధ్యనే విడుదలైన ఆడియోకి మంచి రెస్పాన్స్ వచ్చింది. దర్శకుడు మిస్కిన్ గతంలో మంచి హిట్స్ ఇచ్చారు. ఈ చిత్రాన్ని యూత్ కు నచ్చేలా తీసారని తెలిపారు.

    English summary
    
 Two dubbing films OKOK and Mask are hitting the screens in parallel with NBK's srimannarayana. While OKOK can be just an OK film because of insignificant star cast (except Hansika), the other one Mask made with high budget and a Super Hero concept.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X