twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    కమ్యూనిస్టునే, ఎన్టీఆర్ భక్తిభావన కల్పించారు: పరుచూరి

    By Pratap
    |

    తనలో స్వర్గీయ ఎన్టీ రామారావు భక్తి భావన కల్పించారని ప్రముక సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ చెప్పారు. కమ్యూనిస్టు భావాలు ఉన్నప్పటికీ ఆధ్యాత్మికతతోనే ాతను ప్రశాంతత పొందుతానని ఆయన అన్నారు. ప్రకాశం జిల్లాని శింగరకొండలో ఆదివారం జరిగిన అయ్యప్పస్వామి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఆ తర్వాత శింగరకొండలోని శ్రీప్రసన్నాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు.

    తాను మొదట్లో దేవుడిని నమ్మేవాడిని కాదని, ఎన్టీఆర్ తనకు భక్త్భివం కలిగించారన్నారు. తనకు, తన స్నేహితులకు జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు తనను ఆధ్యాత్మిక చింతన వైపు మళ్లించాయన్నారు. తన అన్న పరుచూరి వెంకటేశ్వర్లు 21సార్లు మాలధారణతో శబరిమలై వెళ్లివచ్చారని, ఆయన మాట ప్రకారం 14సంవత్సరాల క్రితం తాను కూడా మాలధారణతో శబరిమలై వెళ్లివచ్చానన్నారు. ఆనాటి నుండి నేటి వరకు క్రమం తప్పకుండా శ్రీఅయ్యప్పస్వామిని నమ్ముకుంటూ ప్రతిసంవత్సరం మాలధారణతో శబరిమలై వెళ్లివస్తున్నానని తెలిపారు. నమ్మిన వారి కోరికలు తీర్చే దేవునిగా తాను అయ్యప్పను నమ్ముతానని ఆయన చెప్పారు.

    కాగా ప్రజల అవసరాలు తీర్చే నందమూరి తారక రామారావు లాంటి నాయకుడు ఎక్కడో పుట్టే ఉంటాడని, అవసరమైన సమయంలో రాష్ట్రాన్ని రక్షించేందుకు దేవుడే పంపిస్తాడని పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. నందమూరి ఆశయాలు తీర్చే నాయకుని కోసం తాను ఎదురు చూస్తున్నానన్నారు. తాను ఎన్టీఆర్ ఆశీస్సులతోనే ఇంతటి వాడినయ్యానని, శ్రీరామునికి హనుమంతునిలాగా, ఎన్టీఆర్‌కు నమ్మిన బంటుగా తానున్నానన్నారు. ప్రజల్లో రాజకీయ చైతన్యం తెచ్చిన దివంగత ఎన్టీఆర్ ఆశయాలు సాధించేందుకు, ప్రజల అవసరాలు తీర్చే నాయకుడు రావాలని తాను కోరుకుంటున్నట్లు తెలియచేశారు.

    English summary
    Cine writer Paruchuri Gopalakrishna said that though he is communist, he believes on God. He said that due to NT Rama Rama Rao he is started to believe in God. He was in Prakasam district yesterday.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X